ఫ్యాక్షన్ నేపథ్యం సినిమాలో బుల్లితెర నటుడు

Share this News:

ఇప్పటి వరకు అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యం వున్న సినిమాలు చాలానే వచ్చాయి. ఇవన్నీ దాదాపు విజయమే సాధించాయి. ఈ ఏడాది మొదట్లో వచ్చిన నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాద’ కూడా అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు సాధించింది. తాజాగా బుల్లితెర నటుడు సాగర్ కూడా ఓ ఫ్యాక్షన్ నేపథ్యం సినిమాలో కనిపించబోతున్నాడు. ‘సిద్ధార్థ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది.

రామ్ గోపాల్ వర్మతో ‘వంగవీటి’ సినిమా తీస్తున్న దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తనకు యాక్టింగ్ అకాడమీలో సీనియర్ అయిన దయానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా భారీ దనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్.. టైటిల్ కి ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది.

ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ‘తనకు ఇప్పటికే బుల్లితెరపై ఆర్కే నాయుడు, మున్నా పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వెండితెరపై సిద్ధార్థ పాత్రను చేయబోతున్నా. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్ముతున్నా. అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యంలో పుట్టి పేరిగిన ఓ యువకుడు తన ప్రేమను దక్కించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్రంలో ప్రధానం అంశం. ఈ నెలాఖరులో గీతావిష్కరణ చేసి… సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుడదల చేస్తాం. బెల్లితెరపై నటించడం కన్నా.. వెండితెరపై నటించం సులువా అంటే.. రెండూ ఒకటే అన్నారు’ సాగర్. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా సాగర్.. మీడియాతో తన కొత్త చిత్రం విశేషాలను పంచుకున్నారు.

పేరు తర్వాత..  పరువు మొత్తం మటాష్
బాల‌య్య 9 కోట్లు ప‌ట్టేశాడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*