స్వామికి నచ్చితే అలానే ఉంటుంది మరి

Share this News:

బీజేపీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి మైండ్ సెట్ గురించి తెలిసిందే. ఎవరైనా ఆయనకు నచ్చకుంటే వారి పని అయిపోయినట్లే. ప్రతి విషయాన్ని భూతద్దంలో వేసి మరీ చాలానే లోపాలు తెర మీదకు తీసుకొచ్చారు. మాటలకు తగ్గట్లే లాజిక్ వాదనతో అందరిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసే స్వామికి ఎవరైనా నచ్చితే ఎలా ఉంటుంది? ఆయన ఎలా పొగుడుతారు? వారిలో ఉండే లోపాల్ని ఎలా కవర్ చేస్తారు? లాంటి సందేహాల్ని తీర్చేలా తాజాగా స్వామి మాట్లాడారు.
మరికొద్ది రోజుల్లో ఆర్ బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజన్ విదేశాల్లో చదువుకున్న విషయాన్ని కూడా రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. విదేశాల్లో పుట్టిన ఉర్జిత్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజన్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్ని.. ఉర్జిత్ నియామకం సందర్భంగా ఎవరైనా కౌంటర్ ఎటాక్ చేస్తారని భావించారో ఏమో కానీ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉర్జిత్ కెన్యాలో పుట్టిన విషయాన్ని ఎవరైనా విమర్శిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదని చెప్పారు. ‘‘ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు మాత్రం కాదు. కానీ రఘురాం రాజన్ మాత్రం భారత్ లో పుట్టి అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్ లో ఉంటున్నాదాన్ని వదులుకోవవటం లేదు’’ అంటూ తాను తీవ్రంగా వ్యతిరేకించే రాజన్ మీద విరుచుకుపడిన ఆయన అదే సమయంలో తాజాగా ఎంపిక చేసిన ఉర్జిత్ ను వెనుకేసుకురావటం గమనార్హం. నచ్చినమ్మ అల్లమైనా బెల్లంలా ఉంటుందని ఊరికే అనరేమో.

డ్రైవింగ్ లైసెన్స్‌కోసం 18 ఏళ్లు ఆగ‌క్క‌ర్లేదు
కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన సింధూ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*