మెగాస్టార్ సాంగ్ ని టైటిల్ గ పెట్టుకున్న యంగ్ హీరో

Share this News:

యువ కథానాయకుడు అదిత్ అరుణ్(తుంగ భద్ర ఫేమ్) తదుపరి చిత్రం టైటిల్ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్  “నా పేరే రాజు”… ఈ చిత్రంలో చిరు అభిమానిగా నటిస్తున్నారు… ఈ చిత్రానికి మారుతీ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన వెంకటేష్ త్రిపర్ణ తొలిసారిగా క్లాసిక్ క్రియేషన్స్ బ్యానేర్ లో  దర్శకత్వం వహిస్తున్నారు… ఈ చిత్రం ద్వార వి.రాజా రెడ్డి గారు నిర్మాతగా మారుతున్నారు… ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, వైజాగ్, కేరళ, కర్ణాటక, చెన్నైలలో జరగబోతుంది…

నిర్మాత వి.రాజా రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సినిమా అదిత్ అరుణ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు… సినిమాకి సంబందించిన నటీ నటులను, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తాను… నిర్మాత వి. రాజా రెడ్డి గారు మరియు చిత్ర బృందం లెజండరీ యాక్టర్ పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నటిస్తున్న 150వ చిత్రం ఘన విజయం సాదించాలని ఆశాభావం వ్యక్తం చేశారు…

కోడెల కుమారుడు వివాదంలో చిక్కుకున్నాడా?
జన్మభూమి రుణం తీర్చుకుంటున్న నాట్స్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*