అవి చూసే అలవాటుంటే కాపురాలు బుగ్గేనట

Share this News:

ఆసక్తికరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. తరచూ ‘ఆ తరహా’ సినిమాలు గుట్టుగా చూసే అలవాటున్న దంపతులు కలిసి బతికే అవకాశం తక్కువని.. వారి వైవాహిక బంధం బండలవుతుందన్న విషయాన్ని అమెరికాలోని ఓక్లాహామా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అడల్ట్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా విడాకులు కోరుకునే మనస్తత్వం ఉంటుందన్న విషయం తేలినట్లుగా సదరు వర్సిటీ పేర్కొంది.

విడాకులు ఎక్కువ కావటానికి ఉన్న కారణాల్లో పోర్న్ మూవీస్ చూసే అలవాటు ఉన్నట్లుగా తేల్చారు. ఈ తరహా సినిమాలు చూసే మగవారు.. ఆడవారి వైవాహిక జీవితాలు బుగ్గేనని తేల్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ తరహా సినిమాలు చూసే అలవాటున్నమగాళ్లతో పోలిస్తే..ఈ అలవాటు ఉన్న ఆడాళ్లు మూడు రెట్లు ఎక్కువగా విడాకులు తీసుకుంటారని వెల్లడించారు.

పోర్న్ మూవీస్ చేసే యువ దంపతుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అయితే.. ఈ తరహా సినిమాలు చూసే వారి వయసును బట్టి కూడా ఇది మారుతుందని.. వయసు పెరుగుతున్న కొద్దీ విడాకులు తీసుకునే విషయంలో ప్రభావం చూపించదని తేల్చారు. ఆడోళ్లతో పోలిస్తే మగవాళ్లే ఈ తరహా సినిమాలు చూస్తారని తేల్చారు. ఏది ఏమైనా.. ఆ తరహా సినిమాలు చూసే వారు..తమ వైవాహిక జీవితంలో కలకలం రేగుతుందన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే సరి. లేకుంటే మాత్రం పెళ్లి పెటాకులు కావటానికి.. ఈ సినిమాలు తమ వంతు పాత్రను పోషిస్తాయన్న విషయం తేలింది. ఆ తరహా సినిమాలతో జర.. జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడపై సంచలన ఆరోపణలు
మెగాస్టార్ సాంగ్ ని టైటిల్ గ పెట్టుకున్న యంగ్ హీరో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*