బాబుకు అదిరిపోయే ఐడియా ఇచ్చిన అమ్మ‌

Share this News:

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలిత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సూప‌ర్ ఐడియా ఒక‌టి ఇచ్చార‌ని అంటున్నారు. అదేంటి గ‌త ఏడాది ఎర్ర‌చంద‌నం కూలీల ఎన్‌కౌంట‌ర్ వివాదం, ఈ ఏడాది పాలూరూ బ్యారేజీ పంచాయ‌తీల‌తో ఇరు రాష్ట్ర స‌ర్కారుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే వార్త‌ల నేప‌థ్యంలోబాబుకు అమ్మ స‌ల‌హా ఇచ్చిందా? ఇంత‌కీ ఆ స‌ల‌హా ఏంటి? అనేదే క‌దా మీ సందేహం. అక్క‌డికే వ‌స్తున్నాం. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై వరాలు జల్లు కురిపించిన అమ్మ ఈ సంద‌ర్భంగా అన్ని విశ్వవిద్యాలయాలను అనుసంధానించే ప్ర‌క్రియకు శ్రీ‌కారం చుట్టారు. అనుసంధానం అనగానే ఏపీ సీఎం చంద్ర‌బాబు గుర్తుకు వ‌చ్చే రేంజ్‌లో ద‌శ‌ల వారీగా వివిధ న‌దుల అనుసంధానం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పైగా ఇప్ప‌టికే బాబుకు హైటెక్ సీఎంగా ఆల్రెడీ ఓ పేరుంది. అందుకే ప‌లువురు త‌మిళ‌నాడులోని తెలుగువాసులు ఈ విష‌యాన్ని మ‌న‌తో షేర్ చేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల‌న్నింటినీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అనుసంధానించే బృహత్తర కార్యక్రమాన్ని చేప‌ట్టిన‌ట్లు సీఎం జ‌య శాసనసభలో ప్రకటించారు. శాసనససభ నిబంధన 110 కింద ఆమె రాష్ట్రంలో ఉన్నత విద్యపైన కొన్ని ప్రకటనలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేస్తామన్నారు. ఇందుకు రూ.160 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా అత్యున్నత విద్యా ప్రమాణాలను అన్ని విశ్వవిద్యాలయాలు పంచుకుని అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని జ‌య చెప్పారు. విశ్వవిద్యాలయాల్లోని కార్యకలాపాలన్నీ ఎప్పటికప్పుడు ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంలో నమోదవుతాయన్నారు. ఫలితంగా పనితీరు మదింపు చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధన విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కలుగుతాయని, ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు, ఉన్నతవిద్యకు అందిస్తున్న పథకాలు, ఫలాల గురించి కూడా ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా తెలియజేస్తామన్నారు. కనీసం అయిదు వేల మంది కూర్చొని తిలకించేలా అన్నా విశ్వవిద్యాలయంలో ఒక భారీ ఆడిటోరియాన్ని కూడా నిర్మించనున్నట్లు జయ తెలిపారు. దీనిని సర్వాంగ సుందరంగా నిర్మిస్తామన్నారు. ఇందులో పలు అంతర్జాతీయ, జాతీయ సదస్సులు, సాంస్కృతిక పండగలు నిర్వహించుకోవచ్చన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపైనా జయ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని 10 ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులను విదేశాలకు పంపిస్తామన్నారు. విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు ఈ విద్యార్థులను పంపి అక్కడ వారికి పక్షం రోజుల పాటు శిక్షణ పొందే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకోసం రూ.1.50 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

సో అమ్మ ఉప‌యోగించిన కాలేజీల అనుసంధానం వ‌యా టెక్నాల‌జీ అనే కాన్సెప్ట్ బాబుకు బాగా క‌నెక్టయ్యేలా ఉందంటున్నారు. చెప్ప‌లేం దాదాపు ప‌దిహేను ఏళ్ల క్రిత‌మే టెక్ మంత్రం జ‌పించిన బాబు ఇపుడు క్లౌడ్  మంత్రంతో క్యాంప‌స్‌ల‌ను క‌నెక్ట్ చేస్తారేమో! ఏమంటారు?

జ‌గ‌న్‌కు ధ‌ర్మాన స‌వాల్‌!
సూపర్ సెలబ్రిటీలకు షాకిచ్చిన సుష్మా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*