షాక్‌: చిరు ” ఖైదీ నెంబ‌ర్ 150 ” టైటిల్ మారుతుందా..!

Share this News:

ఏ ముహూర్తాన చిరు 150వ సినిమా చేయాల‌ని అనుకున్నాడో గాని ఆ సినిమా విష‌యంలో ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఈ సినిమా స్టోరీ కోసం ఎన్నో క‌థ‌లు విని చివ‌ర‌కు కోలీవుడ్ నుంచి క‌త్తి సినిమా క‌థ‌ను అరువు తెచ్చుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ విష‌యంలో ప‌లు పేర్లు అనుకుని ఫైన‌ల్‌గా వినాయ‌క్‌ను ఫిక్స్ చేశారు. ఇక హీరోయిన్‌, టైటిల్ విష‌యంలోను పెద్ద గంద‌ర‌గోళ‌మే న‌డిచింది. ఇవ‌న్నీ ఏదోలా సెట్ చేసుకుని షూటింగ్ జ‌రుగుతుంద‌నుకుంటుండ‌గానే ఇప్పుడు మ‌రో చిక్కు వ‌చ్చిప‌డిన‌ట్టు స‌మాచారం.

   చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమాకు టైటిల్‌ ‘ఖైదీ నంబర్‌ 150’ అని కూడా ప్రకటించేశారు. అయితే మెగా కాంపౌండ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ టైటిల్ మారిపోతున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి అస‌లు రీజ‌న్ ఏంటంటే ‘ఖైదీ నంబర్‌ 150’ కు అనుకున్న రెస్పాన్స్ రాలేదు. దీంతో చిరుతో పాటు వినాయ‌క్ అండ్ టీం కాస్త టెన్ష‌న్‌గానే ఉంద‌ట‌. చివ‌ర‌కు వీరంతా స‌మావేశ‌మై ఈ టైటిల్‌ను మార్చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

 చిరు బెస్ట్ ఫ్రెండ్స్ సైతం ఈ టైటిల్ ప‌ట్ల పెద్ద‌గా సానుకూల‌త వ్య‌క్తం చేయ‌లేద‌ని..దీంతో చిరు సైతం టైటిల్ మార్చేందుకే మొగ్గు చూపుతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ టైటిల్‌పై ఇన్న‌ర్ టాక్ ఇలా ఉంటే హోరెత్తిపోవాల్సిన సోష‌ల్ మీడియాలో కూడా దీని గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేడు.

 చిరు గ‌తంలోనే ఎప్పుడో ఖైదీ నెంబర్‌ 786 టైటిల్‌తో ఓ సినిమా చేశాడు. ఇక తాజా టైటిల్ కూడా దాన్ని కాస్త మార్చిన‌ట్టుగానే క‌నిపిస్తోందే కాని ప‌వ‌ర్ ఫుల్‌గా లేదు. దీంతో ‘ఖైదీ నంబర్‌ 150’ టైటిల్ మార్చి కొత్త టైటిల్ పెట్టాల‌ని చిరు అండ్ వినాయ‌క్ టీం డిసైడ్ అయ్యింద‌ట‌.

తిరుమ‌ల‌లో ప‌వ‌న్ గెస్ట్‌హౌస్ వ‌ద్ద హైడ్రామా
ఆ టీవీ ఛానెల్‌లో న‌యీం భారీ పెట్టుబ‌డులు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*