15 ఏళ్ల మెగా ఫ్యామిలీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఎన్టీఆర్‌

Share this News:
టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో ఇప్ప‌టికే ఎన్నో పాత రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించాడు. గ్యారేజ్ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్‌తో పాటు రూ.80 కోట్ల షేర్ సాధించి…టాలీవుడ్ హ‌య్య‌స్ట్ వ‌సూళ్ల సినిమాల‌లో బాహుబ‌లి, శ్రీమంతుడు త‌ర్వాత మూడో ప్లేస్ ద‌క్కించుకుంది. వ‌రుస రికార్డుల ప‌రంప‌ర‌లో గ్యారేజ్ మెగా ఫ్యామిలీ పేరిట గ‌త 15 సంవ‌త్స‌రాలుగా కంటిన్యూ అవుతోన్న ఓ అరుదైన రికార్డును సైతం చెరిపేసింది.
 టాలీవుడ్‌లో గ‌త 15 సంవ‌త్స‌రాలుగా టాప్‌-3 మూవీస్‌లో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు ఏదో ఒక ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు గ్యారేజ్ దెబ్బ‌కు మెగా ఫ్యామిలీ హీరోలు ఆ మ్యాజిక్ మార్క్‌ను కాపాడుకోలేపోయారు. 2001 నుంచి ఈ మ్యాజిక్ మార్క్‌ను చూస్తే అప్పుడు బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, నువ్వే కావాలి సినిమాలు టాలీవుడ్ టాప్‌-3 గ్రాస‌ర్స్ లిస్టులో ఉండేవి.
 త‌ర్వాత 2001లో ఖుషీ సినిమాతో ప‌వ‌న్ ఆ ప్లేస్‌లోకి వ‌చ్చాడు. 2002లో చిరు ఇంద్ర సినిమా టాలీవుడ్‌లో అగ్ర స్థానాన్ని సాధించింది. అప్పటికి అదే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. ఇక చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ 2009లో మ‌గ‌ధీర సినిమాతో టాలీవుడ్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత ప‌వ‌న్ అత్తారింటికి దారేది సినిమాతో మ‌గ‌ధీర రికార్డును దాటేసి టాప్ గ్రాసర్ లిస్టులో ఫ‌స్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఇక రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో అత్తారింటికి దారేది రికార్డును సులువుగా దాటేశాడు.
 బాహుబ‌లి, శ్రీమంతుడు త‌ర్వాత ప‌వ‌న్ అత్తారింటికి దారేది సినిమాతో మూడో ప్లేస్‌లో మెగా ఫ్యామిలీ కంటిన్యూ అవుతూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ అత్తారింటికి దారేది సినిమా రికార్డును క్రాస్ చేసి మూడో ప్లేస్‌లోకి వ‌చ్చేశాడు. సో దీంతో గ‌త 15 సంవ‌త్స‌రాలుగా టాలీవుడ్ టాప్ -3 గ్రాస‌ర్ల జాబితాలో ఏదో ఒక మెగా హీరో సినిమా ఉంటుండ‌గా ఇప్పుడు ఎన్టీఆర్ దెబ్బ‌కు ఆ రికార్డు చెరిగిపోయింది.
మ‌జ్ను… నాని రేంజ్ ఏంటో చెప్పింది
మ‌రో మైలురాయి దాటేసిన గ్యారేజ్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*