న్యాయ ధిక్కారంః సుప్రీం తీర్పును అమ‌లుచేయం 

Share this News:
తమిళనాడుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం కుదరదని  కర్ణాటక ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. కేవ‌లం తాగు నీళ్లు మాత్రమే ఇవ్వగలమని స్ప‌ష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు బెంగ‌ళూరులో ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కావేరి లో నీళ్లు తక్కువగా వున్నందున సుప్రీం తీర్పు ప్రకారం తమిళనాడుకు నీళ్లివ్వడం సాధ్యం కాదని, తాగు నీరు మాత్రమే ఇవ్వగలమని ఆ తీర్మానం పేర్కొంది.
కావేరీ నీటి వివాదం నేప‌థ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానమిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు ఉత్తర్వులను అముల చేయడం అసాధ్యమని అన్నారు. కావేరీ బేసిన్‌ పరిధిలోనున్న నాలుగు రిజర్వాయర్లలో జలాల పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆ నీళ్లు తాగునీటి అవసరాలకే చాలవని, కాబట్టి వీటిని తాగు నీటికి తప్ప మరి వేటికీ విడుదలజేయలేమని సిద్ద‌రామ‌య్య‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌డిన అనంత‌రం కర్ణాటక ప్రభుత్వం సుప్రీం తీర్పు ను ధిక్కరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండ‌గా కర్ణాటక అసెంబ్లీ తీర్మానంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  వివాదానికి కేంద్ర బిందువైన మాండ్య ప్రాంతంలోని శ్రీరంగపట్నం వద్దనున్న క్రిష్ణరాజసాగర్‌ రిజార్వయర్‌ గరిష్ట పరిమితి 124. 80 అడుగులు కాగా తాజాగా  అందులోని నీటి మట్టం 86. 55 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కావేరీ జలవివాదంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్నందున కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
ముఖ్య‌మంత్రిగా మ‌హేష్‌బాబు..!
నాగ‌చైత‌న్య‌-ఎన్టీఆర్ ఒకే సినిమాలో..! 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*