ఎలక్ట్రానిక్స్ కంటైనర్లో ‘చైనా’ కుక్కలు

Share this News:

తమిళనాడులో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. పలు సందేహాలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం. చైనా నుంచి వచ్చిన ఒక కంటైనర్లో ఎల‌క్ట్రానిక్ వస్తువులతో పాటు రెండు కుక్క పిల్లలు ఉండటం కొత్త కలకలాన్ని రేపుతోంది. ఈ కుక్కపిల్లలు ఎలా వచ్చాయి? కొత్త వైరస్ ను భారత్ లో ప్రవేశ పెట్టటానికి వీలుగా.. ఈ కుక్కల్ని చైనా నుంచి పంపారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఏ దేశాన్నైనా దెబ్బ తీయాలంటే అనుసరించే పద్ధతులు వేరుగా ఉండేవి. పెరిగిన సాంకేతికతతో కొత్త వైరస్ ను దేశంలోకి పంపటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయటంతో పాటు.. దేశంలో కొత్త కలకలాన్ని రేపే దుర్మార్గానికి పాల్పడుతున్నారు. తాజాగా జరిపిన తనిఖీల్లో దొరికిన కుక్క పిల్లలు ఆ కోవకు చెందినవేనా? కాదా? అన్నది తేలకున్నా.. అలాంటి ప్రయత్నంలో భాగంగా జరిగిందేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీ పెరుంబుదూర్ లో ఒక మొబైల్ కంపెనీ ఉంది. ఈ సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి. ఎప్పటి మాదిరే తాజాగా చైనా నుంచి ఒక కంటైనర్ తమిళనాడుకు చేరుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండాల్సిన ఆ కంటైనర్ ను అధికారులు తనిఖీ చేయగా.. అందులో రెండు కుక్క పిల్లలు ఉండటాన్ని గుర్తించిన హార్బర్ అధికారులు వెంటనే బ్లూక్రాస్ సంస్థకు సమాచారం ఇచ్చారు. ఏదైనా ప్రత్యేక వైరస్ ఏమైనా ఉందా? అన్న సందేహంతో వైద్యులు పరీక్షలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.

గాంధీజీ జ్ఙాప‌కాల్లో నాట్స్‌!
సంక్రాంతికి వ‌స్తున్న‌ మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150`

Share this News:

Leave a comment

Your email address will not be published.

*