సంక్రాంతికి వ‌స్తున్న‌ మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150`

Share this News:

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఈ చిత్రంలో అందాల తార‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిరంజీవి కుమారుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కొత్త‌గా ఏర్పాటు చేసిన త‌న సొంత బేన‌ర్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న రావ‌డంతో చిత్ర యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -“70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్ కంటైనర్లో ‘చైనా’ కుక్కలు
సిలికానాంధ్ర వ‌ర్సిటీకి హ‌నిమిరెడ్డి భూరి విరాళం!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*