మిస్త్రీ తొల‌గింపు వెన‌క అస‌లు మిస్ట‌రీ

Share this News:

సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ! ఒక్క‌మాట‌లో చెప్పాలంటే సైర‌స్ మిస్త్రీగా ఇటీవ‌ల కాలంలో నిత్యం వార్త‌ల్లో ఉంటున్న వ్య‌క్తి! టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయిన ఆయ‌నకు ఉన్న‌ట్టుండి టాటా గ్రూప్ టాటా చెప్పింది! అంత పెద్ద ప‌ద‌వి, ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యంలో చైర్మ‌న్ అయిన సైర‌స్‌కి ఇది క‌ల‌లో కూడా ఊహించ‌ని భారీ షాక్‌! ప‌ద‌విని చేప‌ట్టి నాలుగేళ్లు కూడా పూర్తి కాకుండానే ఆయ‌నను ఆ ప‌ద‌వి నుంచి అత్యంత దారుణ‌మైన అవ‌మాన‌క‌ర రీతిలో టాటా బోర్డు తొల‌గించింది. లండ‌న్ బిజినెస్ స్కూల్‌లో చ‌దివి, ఐరిష్‌-ఇండియ‌న్ అయిన మిస్త్రీని 2012లో టాటా సంస్థ ఆరో చైర్మ‌న్‌గా ఆనాడు నియ‌మించిన‌ప్పుడు వాణిజ్య వ‌ర్గాల్లో ఎంత పెద్ద సంచ‌ల‌నం రేగిందో… ఇప్పుడు ఆయ‌నను హ‌ఠాత్తుగా తొల‌గించిన‌ప్పుడు అంత‌కంటే ఎక్కువ సంచ‌ల‌నం రేగింది.

ఏ ఇద్ద‌రు వాణిజ్య వేత్త‌లు క‌లిసినా.. ఇప్పుడు సైర‌స్ ఉద్వాసన గురించే చ‌ర్చ‌. ఏ ఇద్ద‌రు పారిశ్రామిక వేత్త‌లు ఫోన్ చేసుకున్నా సైర‌స్ గురించే క‌బుర్లు! ఇంత‌గా సంచ‌ల‌నం సృష్టించిన సైర‌స్ ఉద్వాస‌న వెనుక అస‌లు ఏముంది? ఏ కార‌ణంతో సైర‌స్‌ని ప‌ద‌వి నుంచి హ‌ఠాత్తుగా ఊడ‌పీకారు? అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే టాటా గ్రూప్ ఎలాంటి కార‌ణాన్నీ అధికారికంగా ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డించేలేదు. అయితే, బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న ఒక‌రు చూచాయ‌గా మీడియాకు అందించిన లీకుల‌ను బ‌ట్టి.. సైర‌స్ ఉద్వాస‌న వెనుక ఆయన స్వ‌యంకృత‌మే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 వాస్త‌వానికి టాటా సంస్థ ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ‌ల్లో ఒక‌టి. నిత్యం పోటీ త‌త్వంతో పోటీలో సాగే ఈ సంస్థ ఇటీవ‌ల కాలంలో ముఖ్యంగా సైర‌స్ బాధ్య‌త‌లు పేట్టాక వెనుక ప‌డింద‌నేది బోర్డు అభిప్రాయం. సైర‌స్ ప‌ద‌విని చేప‌ట్టాక టాటా గ్రూప్‌లోని అనేక సంస్థ‌లు న‌ష్టాల బాట ప‌ట్టాయి. కేవ‌లం రెండు మాత్ర‌మే లాభాల్లో ఉన్నాయి. దీంతో ఆగ్ర‌హించిన బోర్డు ఆయ‌న‌ను తొల‌గిస్తేనే కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని గుర్తించింది. ఈ క్ర‌మంలోనే సైర‌స్‌పై ఉన్న‌ట్టుండి పిడుగు లాంటి నిర్ణ‌యం తీసుకుంది. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారనే టాక్ న‌డుస్తోంది.

అయితే, టాటా గ్రూప్ అనేది ఎప్పుడూ సంప్ర‌దాయ‌క విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే,  సైర‌స్ విష‌యంలో అలాంటిదేమీ లేకుండా కేవ‌లం ఫ‌క్తు బిజినెస్ యాట్టిట్యూడ్‌లోనే నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇక‌, ఈ విష‌యంలో బాధితుడిగా మిగిలిన సైర‌స్‌.. త‌న‌కు సంజాయిషీ చెప్పుకునే అవ‌కాశం కూడా క‌ల్పించ‌లేద‌ని ప్ర‌శ్నించినా.. బోర్డు నుంచి స‌మాధానం క‌టువుగానే రావ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనిపై టాటా బోర్డు నిర్ణ‌యంపై సైర‌స్ న్యాయ పోరాటానికి దిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కొస‌మెరుపు ఏంటంటే.. సైర‌స్‌ను కేవ‌లం చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి మాత్ర‌మే తొల‌గించిన టాటా బోర్డు.. టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్‌గా ఆయ‌న‌ను కొన‌సాగించ‌నుంది. మ‌రి ఇంత అవ‌మానం జ‌రిగిన త‌ర్వాత ఆయ‌న కొన‌సాగుతారో లేదో చూడాలి.

జ‌గ‌న్ మాట‌… లోక్‌స‌భ‌లో వైసీపీని జీరో చేస్తుందా?
టాటాల‌కు లాభాల్లేని బిజినెస్ అక్క‌ర్లేద‌ట‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*