న‌వ య‌వ్వ‌నంగా… చిరు ‘150’ ఫ‌స్ట్ లుక్‌

Share this News:

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెంబ‌రు 150’ చిత్రం ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. ఇంత‌కుముందే చెప్పిన‌ట్లు… చెప్పిన టైమ్‌కు చిరు త‌న తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసేశారు. త‌న అభిమానుల్లో ఓ రోజు ముందుగానే దీపావ‌ళి కాంతుల‌ను నింపేశారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత తెర‌పై క‌నిపిస్తున్న చిరు… ఎలా క‌నిపిస్తారోన‌ని ఆయ‌న అభిమానులు తెగ ఇదైపోయారు. వ‌య‌సు పైబ‌డ‌డం, రాజ‌కీయాల్లోకి దిగిన నేప‌థ్యంలో… గ‌తంలో ఆయ‌న‌లో క‌నిపించిన యంగ్ మేన‌రిజమ్ ఇప్పుడు క‌నిపిస్తుందా? అన్న బెంగ కూడా ఆయ‌న ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టింది. అయితే అభిమానుల్లోని ఆ బెంగ‌ను చిరు ఒక్క దెబ్బ‌తో… ఫ‌స్ట్ లుక్‌లోనే ప‌టా పంచ‌లు చేశార‌నే చెప్పాలి.

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం దాదాపుగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ హిట్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు… నేటి కుర్ర హీరోల‌కు ఏమాత్రం తీసిపోని లుక్కుతో క‌నిపిస్తున్నారు. మునుప‌టి ఫామ్ కాని, మేన‌రిజ‌మ్ కానీ చిరులో ఏమాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ చూస్తేనే ఇట్టే అర్ధ‌మైపోతోంది. చాలా గ్యాప్ త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న చిరు… ఈ చిత్రం ద్వారా ఇప్ప‌టికే రూ.85 కోట్ల‌కు పైగా బిజినెస్ రాబ‌ట్టిన‌ట్లు సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. రిలీజ్‌కు ఇంకా రెండు నెల‌ల స‌మ‌య‌ముంద‌న‌గానే ఈ మేర బిజినెస్ రాబ‌ట్టిన ఈ చిత్రం… రిలీజ్ త‌ర్వాత ఇంకెంత మేర బిజినెస్ రాబ‌డుతుందోన‌న్న ఆస‌క్తిక‌ర చర్చ‌కు ఫ‌స్ట్ లుక్ తెర లేపేసింది.

ఇక ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ’ టీడీపీ!
గాలి ఆహ్వానితుల లిస్టు చాలా పెద్ద‌దే!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*