అంబానీ డీల్ గురించి వర్మ సందేహం

Share this News:

రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ఏ పండగ వచ్చినా సరే.. ఆ సందర్భంలో తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పడం ఆయన స్టయిల్. నిన్న దీపావళి సంద్భంగానూ వెరైటీ విషెస్ చెప్పాడు వర్మ. టపాసులు కాల్చి కాలుష్యానికి కారణమవుతున్న వాళ్లందరికీ ‘అన్ హ్యాపీ దీపావళి’ అంటూ విషెస్ చెప్పిన వర్మ తనకు మాత్రం ప్రతి రోజూ దీపావళే అన్నాడు. ఇక అక్కడితో ఆగకుండా లక్ష్మీ దేవి మీద.. ఇండియాలోనే నెంబర్ వన్ ధనికుడైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మీద తనదైన శైలిలో కామెంట్లు చేశాడు వర్మ. వీళ్లిద్దరి మధ్య ఉన్న రహస్య డీల్ ఏంటని వర్మ ప్రశ్నించాడు.

‘‘అమ్మవారు లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఎంతో మంది ఉండగా.. ముఖేష్ అంబానీనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది ఎందుకు..? ఆయన ఆమెను ప్రత్యేకంగా ఏమైనా ప్రార్థిస్తారా..? బయటకు చెప్పడానికి వీలు లేని డీల్ ఏదైనా వాళ్ల మధ్య ఉందా’’ అంటూ సందేహం వ్యక్తం చేశాడు వర్మ. ఇలా దేవుళ్ల విషయంలో వెటకారాలు ఆడటం వర్మకు కొత్తేం కాదు. గతంలో వినాయకచవితిపై వర్మ చేసిన కామెంట్లు ఎంత సంచలనం రేపాయో తెలిసిందే. ఇక దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించే వాళ్లందరిదీ స్వార్థం అని.. వాళ్లందరూ తమకే చాలా సంపద దక్కాలని కోరుకుంటారని.. ఇతరులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని కోరుకోరని వర్మ అన్నాడు. దీపావళి అందరికీ సంపద తెచ్చిపెట్టాలని వర్మ ఆకాంక్షించాడు.

బాలకృష్ణతో దీపావళి ఇంకా గుర్తు పెట్టుకున్న రోజా
ఎన్నారై మ‌హిళ తెగువ చూశారా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*