ఫ్యాన్సీ నంబ‌రు కోసం 60 కోట్లు

Share this News:

ఫ్యాన్సీ నంబ‌రు క్రేజీ మామూలుగా ఉండ‌ద‌నేందుకు ఇదో నిద‌ర్శ‌నం. తాను మామూలు మనిషిని అని చెప్పుకునే ఓ వ్యాపారి తన కారు ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు చేశాడు. దుబాయిలో ప్రాపర్టీ డెవలపర్ అయిన భారతీయుడు బల్వీందర్ సహానీ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అత్యధిక డిమాండ్ ఉన్న సంఖ్య కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించాడు. అక్టోబర్ 8న నిర్వహించిన వేలంలో 33 మిలియన్ దిర్హామ్స్ పెట్టి డీ5 అనే సంఖ్యను ఆయ‌న‌ దక్కించుకున్నాడు.

గత ఏడాది కూడా 09 నంబర్‌ను 6.7 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇంకా రెండు రోల్స్ రాయిస్ కార్లకు ఇలాంటి నంబర్లే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. తాను కూడా అందరిలాగే మామూలు మనిషినని.. ప్రతి సంవత్సరం నాకు నేనే ఓ బహుమతి ఇచ్చుకుంటానని తెలిపాడు. కొంత మంది తాను డబ్బును వృథా చేస్తున్నానని ఆరోపిస్తారు.. కానీ తిరిగి ఇవ్వడంపై తనకు నమ్మకం ఉందని.. తాను వెచ్చించే డబ్బు చారిటీలకు, దుబాయ్ నగర అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

చెర్రీ కొత్తిల్లు ఖ‌రీదు ఎంతంటే!
నేడు ఏపీఎన్నార్టీఎస్‌, సిలికానాంధ్ర భేటీ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*