మోదీపై రాహుల్ గాంధీ వ్యంగ్యం చూశారా?

Share this News:

దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యంపై ఆయా రాజ‌కీయ పార్టీలు త‌మ‌దైన రీతిలో ప్ర‌తిస్పందిస్తున్నాయి. న‌ల్ల‌ధ‌నానికి చెక్ పెట్టేందుకేనంటూ ఈ నెల 8న రాత్రి మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ… రూ.500, రూ.1,000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. వెనువెంట‌నే అదే రాత్రి 12 గంట‌ల నుంచి ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చేశాయి. దేశ ప్ర‌జ‌లంతా మోదీ సాహ‌సేత నిర్ణ‌యం తీసుకున్నారంటూ కీర్తించారు. ఈ క్ర‌మంలో నాడు మోదీ నిర్ణ‌యాన్ని ఒక‌రు ఇద్ద‌రు మిన‌హా విమ‌ర్శించిన నాయ‌కులే లేరు.

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత క‌రెన్సీని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచే విష‌యంలో వ్య‌వ‌స్థ విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందును ఆస‌రా చేసుకుని ఆయా పార్టీలు ఒక్క‌టొక్క‌టిగా మోదీపై అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న గోవా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. 70 ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతి తుప్పును వ‌దిలించేందుకు తాను ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాన‌ని, కాస్తంత క‌ష్ట‌మైనా కొన్నాళ్ల పాటు వేచి చూస్తే ఫ‌లితాలు కనిపిస్తాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌జ‌లు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నార‌నీ ఆయ‌న పేర్కొన్నారు. అయితే అవినీతిప‌రులు త‌న‌ను అంతం చేసేందుకు కూడా వెనుకాడ‌ర‌ని, చావుకైనా తాను సిద్ధ‌మేన‌ని, అవినీతిని మాత్రం తుద‌ముట్టిస్తాన‌ని ఆయ‌న ప్ర‌తిన‌బూనారు.

ఈ కామెంట్ల‌పై కాంగ్రెస్ పార్టీ స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు వేగంగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అయితే… అవ‌కాశం చిక్కింది క‌దా అని మోదీపై ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీపై సెటైర్ల వేసిన రాహుల్ గాంధీ… ”నిన్న న‌వ్యారు, నేడు ఏడ్చారు” అంటూ ఓ రేంజీలో ఫైర‌య్యారు. ”మొద‌ట న‌వ్వులు… ఇప్పుడు క‌న్నీళ్లు. అజ్ఞానం ఇప్పుడు వాస్త‌వంలోకి వ‌చ్చింది” అంటూ రాహుల్ సంధించిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ మేర కామెంట్లు చేయ‌ని రాహుల్ గాంధీ… ఈ ద‌ఫా మాత్రం చాలా స‌మ‌య‌స్ఫూర్తిగా మోదీపై ఎదురు దాడికి దిగార‌ని చెప్పాలి.

స్వామికి… ఎవరైనా ఒక‌టే!
పున‌ర్జ‌న్మ ఎత్తానంటున్న ‘అమ్మ‌’!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*