బ్యాంకుల ముచ్చట ఆ మీడియాలకు తెలిసింది ఇప్పుడేనా?

Share this News:

ఇదెక్కడి సిత్రం అన్నట్లుగా ఉంది కొన్ని మీడియా సంస్థల తీరు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో బ్యాంకుల వద్దా.. ఏటీఎంల వద్దా విపరీతమైన రద్దీ చోటు చేసుకోవటం తెలిసిందే. నగదు విత్ డ్రాకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్ని బ్యాంకులు పాటించాల్సి ఉంది. అయిత.. కరెన్సీ కొరత కారణంగా ఒక వ్యక్తి వారంలో రూ.24వేల మొత్తం డ్రా చేసుకునే వీలు ఉన్నప్పటికీ.. బ్యాంకులు మాత్రం ఆ మొత్తాన్ని ఇవ్వలేని పరిస్థితి.

నగదు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. బ్యాంకుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్న బ్యాంకులు.. విత్ డ్రా చేసుకోవటానికి వచ్చిన ఖాతాదారులకు తమదైన కండీషన్లు పెడుతున్నాయి. తమకు నగదు లభ్యత లేని నేపథ్యంలో కేంద్రం చెప్పినట్లు కాకుండా.. తమకున్న నగదును అందరికి అందేలా చేస్తామంటూ కొన్ని బ్యాంకులు రూ.2వేలు.. మరికొన్ని బ్యాంకులు రూ.3వేలుఇంకొన్ని బ్యాంకులు రూ.5వేలు చొప్పున  నగదు విత్ డ్రాకు అనుమతి ఇస్తున్నాయి.

ఇది.. ఇవాల్టికి ఇవాళ చోటు చేసుకున్న పరిణామం కాదు. ఆ మాటకు వస్తే దాదాపు గడిచిన తొమ్మిది రోజులుగా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అయితే.. అదేదో ఇప్పుడే చోటు చేసుకుంటున్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ ల మీద బ్రేకింగ్ న్యూస్ లు వేస్తున్న పరిస్థితి. కొన్ని టీవీ ఛానళ్లు అయితే.. ఏకంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ.. బ్యాంకుల్లో విత్ డ్రా మీద పరిమితి. కేంద్రం చెప్పినట్లుగా రూ.24వేలు విత్ డ్రా చేసుకునేందుకు ససేమిరా అంటున్న వైనం అని అచ్చేస్తున్నారు.

ఆశ్చర్యం అనిపించేదేమిటంటే.. గడిచిన కొద్దిరోజులుగా బ్యాంకుల్లో వాస్తవ పరిస్థితి ఇలానే ఉన్నా.. ఇప్పుడే ఏదో జరిగిపోయినట్లుగా బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావుడి చేయటం ఏమిటి? అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఒకవేళ నిజాన్ని నిజంగా చెప్పాలన్నదే ఉద్దేశం అయితే.. గడిచిన ఇన్ని రోజులుగా ఇదే తీరుతో బ్యాంకులు వ్యవహరిస్తున్న విషయాన్ని చెప్పాలి. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొన్ని ఛానళ్లు చేస్తున్న హడావుడి చూసినప్పుడు..  బ్యాంకుల మీద మీడియా ఛానళ్లు కొన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ చేస్తున్న హడావుడి ప్రజల్లో మరింత కంగారు పుట్టిస్తుందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

ఏ ఛాన్సునీ వదలని నల్ల కుబేరులు
బ్యాంకులో డ‌బ్బువేస్తే 60% ప‌న్ను!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*