మోడీని తిడితే డైవర్స్ ఇస్తానంటోంది

Share this News:

అభిమానం మామూలే. కానీ.. అదే అభిమానం ఇద్దరి మనుషుల మధ్య ఎంతలా చిచ్చు పెడుతుందన్న దానికి తాజా ఉదంతం ఒక ఎగ్జాంఫుల్. ఈ మధ్య కాలంలో మరే నేతకు దక్కనంత పాపులార్టీ ప్రధాని మోడీకి వచ్చేసిందని చెప్పాలి. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో అవినీతి అన్నది లేకపోవటం.. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి పెద్ద నోట్ల రద్దు వరకూ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న ఆయన్ను అమితంగా ఆరాధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ మీద తనకెంత అభిమానమో చెప్పుకొచ్చిందో మహిళ. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో చూస్తే.. నోట మాట రాదంతే. ప్రధాని మోడీని ఈ మధ్యన తన భర్త విమర్శిస్తున్నారని.. అవసరమైతే మోడీ కోసం తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సైతం సిద్ధమని మైకు ముందు ఓపెన్ గా చెప్పేసి షాకిచ్చింది.

రద్దు నేపథ్యంలో ఏటీఎంల వద్ద నెలకొన్న రద్దీ.. బ్యాంకు వద్ద ఉన్న భారీ క్యూ లైన్ల గురించి స్పందించిన ఆమె.. ఏటీఎంల వద్దకు వచ్చి మోడీ నింపాలా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మోడీ ఏ దురాశ లేకుండా పని చేస్తున్నారని.. అలాంటి వారు దేశంలో ఎంత మంది ఉన్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తి కోసం ఎందుకు అండగా నిలుచోరు? అని ప్రశ్నించిన ఆమె.. అందరి కోసం మోడీ ఒక్కరే పోరాడుతున్నారని వ్యాఖ్యానించింది. దేశం కోసం సైన్యం ఎన్నో త్యాగాలు చేస్తుందని.. తాగటానికి నీరు.. తినటానికి తిండి కూడా లేని చోట సైనికులు తమ విధులు నిర్వర్తిస్తుంటారని.. అలాంటిది దేశం కూడా ఆ మాత్రం కష్టపడరా? అన్న ప్రశ్నను సంధిస్తూ.. ఏటీఎం కష్టాలకు బ్యాంకుల్ని ప్రశ్నించాలే కానీ మోడీని కాదని వాదిస్తోన్న ఆమె వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రష్మీ జైన్ గా చెబుతున్న సదరు మహిళ మాట్లాడిన ఒకటిన్నర నిమిషం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మాటలతో భర్తకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ఈ మహిళ ఏ ప్రాంతానికి చెందిన వారు అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. నోట్ల రద్దుపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నవేళ.. ఇదే తరహాలో విమర్శిస్తున్న తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సైతం తాను సిద్ధమన్న మహిళ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఏపీలో చంద్ర‌బాబే కింగ్‌!
న్యూ ఇయ‌ర్‌ నుంచి గోవా ‘క్యాష్ లెస్’ స్టేట్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*