కొత్త సినిమాలో చిరు లుక్ అదిరిపోయిందిగా!

Share this News:

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నెం:150 చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి కొన్ని లేటెస్ట్ ఫొటోలు విడుద‌ల‌య్యాయి. నిన్న సాయంత్రమే సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫొటోలు దాదాపుగా వైర‌ల్‌గా మారాయనే చెప్పాలి. అయినా ఈ స్టిల్స్ వైర‌ల్‌గా మార‌డానికి వాటిలో అందేముంద‌నేగా మీ ప్ర‌శ్న‌? ఒక్క సారి స‌ద‌రు ఫొటోల‌ను చూస్తే క‌ళ్లు తిప్పుకోవ‌డం క‌ష్ట‌మే.

ఎందుకంటే దాదాపుగా 8 ఏళ్ల త‌ర్వాత సినిమాలో న‌టిస్తున్న చిరు… మునుప‌టి కంటే కూడా చాలా హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. అంతేకాకుండా ప‌క్క‌నే నిల‌బ‌డ్డ కుర్ర హీరోయిన్‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ అందానికి ఏమాత్రం తీసిపోని రీతిలో చిరు క‌నిపిస్తున్నారు. వ‌య‌సు మీద ప‌డ్డా ఆయ‌న ముఖంలో మాత్రం యంగ్ ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గ‌తంలో ఆయ‌న బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ఘ‌రానా మొగుడు, ఠాగూర్‌, స్టాలిన్ త‌దిత‌ర చిత్రాల్లో క‌నిపించిన దాని కంటే కూడా తాజా చిత్రంలో ఆయ‌న ఫేస్‌లో యంగ్ లుక్ మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

చ‌క్క‌టి హెయిల్ స్టైల్‌తో క‌నిపిస్తున్న చిరు… కాజ‌ల్ భుజాన్ని ప‌ట్టుకుని, ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్‌తో ఏదో మాట్లాడుతున్న‌ట్లున్న ఫొటో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. ఇక ఓ గోడ చాటుగా ముఖం మాత్రమే క‌నిపించేలా నిల‌బ‌డ్డ చిరు మ‌రింత హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. ఈ స్టిల్స్ చూస్తేంటే… ఖైదీ నెం: 150 బ్లాక్ బ‌స్ట‌రేన‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ చిత్రంపై జ‌నాల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేందుకు ఇలాంటి ఫొటోలు,. చిన్న‌పాటి వీడియోలు త‌ర‌చుగా విడుద‌ల‌వుతాయ‌ట‌. చిత్రం రిలీజ‌య్యేదాకా ఇలాంటి కొత్త కొత్త ప్ర‌యోగాల‌ను చేయాల‌ని చిత్ర నిర్మాత అయిన చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ్ నిర్ణ‌యించార‌ట‌. మ‌రి ఆ ప్ర‌చారం ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

chiru-newchiru-new-1

విడుద‌ల‌కు ముందే వ‌ర్మ‌కు సినిమా క‌న‌బ‌డిందా?
చంద్ర‌బాబు విఫ‌ల ప్ర‌యోగం చేస్తున్నారా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*