ట్రైల‌ర్‌లోనే చిరు దుమ్ము లేపారుగా!

Share this News:

మెగాస్టార్ అభిమానుల‌కు నిన్న పండుగేన‌ని చెప్పాలి. ఎందుకంటే… దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం ఖైదీ నెం:150 ట్రైల‌ర్ నిన్న‌నే విడుద‌లైంది. టీజ‌ర్‌, ఫ‌స్ట్ పోస్ట‌ర్ ల‌లోనే అందరు ఊహించిన దానికంటే కూడా యంగ్ గా క‌నిపించిన చిరు… ట్రైల‌ర్‌లో మ‌రింత యంగ్ గా ద‌ర్శ‌న‌మిచ్చారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పేరిట చిరు త‌న‌యుడు, టాలీవుడ్ యంగ్ హీరో రాంచ‌ర‌ణ్ తేజ్ స్వ‌యంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చిరు టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

2008లో సినీ రంగం నుంచి రాజ‌కీయ తెరంగేట్రం చేసిన చిరంజీవి… పాలిటిక్స్‌లో అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోవ‌డంతో తిరిగి త‌న‌ను పెంచి పెద్ద చేసిన సినీ రంగంలోనే అడుగుపెట్టారు. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా ఇప్ప‌టికే పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ న‌డుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు చెర్రీ స‌న్నాహాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం తాను న‌టించిన ధృవ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా అమెరికా వెళ్లిన చెర్రీ… అక్క‌డి నుంచి రాగానే త‌న తండ్రి చిత్రం ప్ర‌మోష‌న్‌లో త‌ల‌మున‌క‌లు కానున్న‌ట్లు స‌మాచారం.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న మొద‌టి చిత్రం, చిరు రీఎంట్రీ త‌ర్వాత ఆయ‌న తొలి చిత్రం, ఓవ‌రాల్‌గా చిరు 150 చిత్రంగానూ ఈ చిత్రానికి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఇంత‌టి ప్రాముఖ్య‌త ఉన్న ఈ చిత్రంపై మెగాస్టార్ అభిమానుల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే చిత్రం కూడా ఉండ‌నుంద‌న్న భావ‌న‌ను క‌లిగించ‌డంలో ట్రైల‌ర్ స‌క్సెస్ అయిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ రెడ్డి గారు… ‘గాలి’ని మించిపోయారే!
ప్రవాస తెలుగు శాస్త్రవేత్తకి ప్రతిష్టాత్మక ​అమెరికా మెడికల్ పురస్కారం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*