ఆ మాటకు అర్థం ‘పాకిస్తాన్ పై యుద్ధమే’

Share this News:

ఇండియాలోకి చొరబడితే నజరానా ఇస్తామని పాకిస్తాన్ చేసిన ప్రకటన చూస్తుంటే అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఎంత బరితెగించిందో అర్థమవుతుంది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం కూడా ఎన్నడూ లేనంత సీరియస్ గా స్పందించింది. తాజాగా కాశ్మీర్ వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇండియా జోలికి వచ్చి తప్పు చేశారు. త్వరలో ఆ దేశాన్ని రెండు ముక్కలు చేస్తాం. తర్వాత అది పది ముక్కలవుతుంది అని రాజ్ నాథ్ సింగ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.

గత జులై నుంచి పాకిస్తాన్-ఇండియాల మధ్య వాతావరణం చాలా వేడెక్కిన నేపథ్యంలో ఇటీవలి పాకిస్తాన్ చర్యలు ఇండియాను బాగా కవ్వించేలా ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం అంతర్గతంగా తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమవుతున్నట్లు కొన్ని చర్యల ద్వారా తెలుస్తోంది. స్వయానా హోంమంత్రి చర్చల మాటే లేకుండా ముక్కలు చేస్తాం అన్న నేపథ్యంలో అఫ్గానిస్తాన్ తో ఇటీవల మనతో ఏకమవడం వంటివన్నీ ఈరోజు రాజ్ నాథ్ మాట్లాడిన మాటలకు ఇండియా యుద్ధం వైపు అడుగులు వేస్తున్నట్టు అర్థం ఇస్తున్నాయి. బలూచిస్తాన్, కరాచీ స్థావరాల ఆధారంగా భారత్ తమను బలహీన పరిచే ప్రయత్నం మొదలుపెట్టిందని పాకిస్తాన్ భయపడుతున్న విషయం తెలిసిందే.

గుంటూరోడు… అబ్బబ్బ భలే ఘాటున్నాడు
దేవి శ్రీ కాపీ కొట్టి దొరికిపోయాడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*