‘ఫ్యాన్’ కింద‌కెళుతున్న‌ ‘మెగాస్టార్‌’ మాజీ

Share this News:

ఏపీలో నానాటికీ బ‌ల‌హీనప‌డిపోతున్న వైసీపీకి అస్స‌లు ఊపిరి ఆడ‌టం లేదు. ఆ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే 20 మంది టీడీపీలోకి వ‌చ్చేశారు. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌క‌నే వారంతా పార్టీ మారుతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించేశారు. 20 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఇద్దరు ఎంపీలు కూడా వైసీపీకి దూర‌మ‌య్యారు. వీరితో పాటు ఇద్ద‌రు ఎమ్మెల్సీలు కూడా జ‌గ‌న్‌కు భారీ ఝ‌ల‌క్కే ఇచ్చారు. ఈ క్ర‌మంలో వైసీపీకి ఎక్క‌డిక‌క్క‌డ నేత‌లు దొర‌క‌ని ప‌రిస్థితి. మ‌రి నేత‌లు దొర‌క‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే క‌ష్ట‌మేన‌ని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందుబాటులో ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు పెద్ద నేత‌లైతే దొర‌క‌డం లేదు కానీ… చోటా మోటా నేత‌లు మాత్రం త‌గులుతున్నారు. అది కూడా అప్పుడప్పుడు మాత్ర‌మే. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నిన్న చోటుచేసుకుంది.

2008లో మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా కెరీర్‌కు కాస్తంత బ్రేకిచ్చి రాజ‌కీయ తెరంగేట్రం చేశారు. తిరుప‌తి వేదిక‌గా చిరు ప్ర‌క‌టించిన ప్ర‌జారాజ్యం పార్టీలోకి నాడు పెద్ద సంఖ్య‌లోనే నేత‌లు క్యూ క‌ట్టారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 18 మంది అసెంబ్లీ సీట్లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత చిరు పార్టీ జెండానే పీకేసి… కాంగ్రెస్‌లో క‌లిసిపోయారు. అయితే ఆయ‌న వెంట వెళ్లిన నేత‌ల్లో ఒక‌రో ఇద్ద‌రో మిన‌హా మిగిలిన నేత‌లంతా త‌మ త‌మ మార్గాలు చూసుకున్నారు. అయితే ఏ మార్గం దొర‌క‌ని నేత‌లు మాత్రం అలాగే ఉండిపోయారు. అలాంటి ఓ నేత తాజాగా వైసీపీ పంచ‌న చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌నే విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.

2009లో విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన వెల్లంప‌ల్లి… ఆ త‌ర్వాత బీజేపీ గూటికి చేరారు. తాజాగా ఆయ‌న నిన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్‌లో క‌లిశారు. త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన వెల్లంప‌ల్లికి జ‌గ‌న్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పార్టీలోకి కూడా ఆహ్వానించార‌ట‌. దీంతో ఈ నెల 13న వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు వెల్లంప‌ల్లి సిద్ధ‌మైపోయారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న లోట‌స్ పాండ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాకు చెప్పి మ‌రీ విజ‌య‌వాడ బ‌య‌లుదేరార‌ట‌.

దేవి శ్రీ కాపీ కొట్టి దొరికిపోయాడు
‘అమ్మ’ ఓట‌మికి ర‌జ‌నీనే కార‌ణ‌మ‌ట‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*