పారీక‌ర్‌కు ఈ బ‌ర్త్‌డే వెరీ వెరీ స్పెష‌ల్‌!

Share this News:

నిజ‌మే… బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారీక‌ర్‌కు ఈ బ‌ర్త్ డే వెరీ వెరీ స్పెష‌ల్‌గానే నిల‌వ‌నుంది. బీజేపీలో మిస్ట‌ర్ క్లీన్ నేత‌గానే కాకుండా… విధి నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్ధ‌వంత‌మైన నేత‌గా ఎదిగిన ఆయ‌న‌తో గోవా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రీ ప్రధాని న‌రేంద్ర మోదీ త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు. పార్ల‌మెంటులో స‌భ్య‌త్వం లేకుండానే ఆయ‌నకు కీల‌క శాఖ అయిన ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే స‌ద‌రు శాఖ‌… పారీక‌ర్ నేతృత్వంలో మునుపెన్న‌డూ లేని రీతిలో స‌త్తా చాటుతోంది. అస‌లు ఆ శాఖ స‌త్తా ఏమిటో ప్ర‌పంచానికి తెలిపేందుకే మోదీ ఆయ‌నకు ఆ శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు మొన్న‌టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ రుజువు చేశాయి.

అస‌లు పారీక‌ర్ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతే… నిత్యం చొర‌బాట్లతో కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. భార‌త స‌రిహ‌ద్దు వెంట పాక్ భూభాగంలో వెల‌సిన ప‌లు ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త సైన్యం వ‌రుస‌గా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల వ్యూహ ర‌చ‌న‌లో పారీక‌ర్ మంత్రాంగ‌మే కీల‌క‌మ‌న్న విష‌యం ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. ముఖ్య‌మంత్రిగా ఉన్నా… కేంద్ర మంత్రిగా ఉన్నా సాదాసీదాగా రోజూ డ్యూటీకి వెళ్లే స‌ర్కారీ ఉద్యోగి త‌ర‌హాలో క‌నిపించే పారీక‌ర్‌… త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను ప‌క్కాగా నిర్వ‌ర్విస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న భారత స‌రిహ‌ద్దు వెంట ఉన్న కీల‌క ప్రాంతాల‌న్నింటినీ చుట్టేశారు. దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాలకు తెగించి భ‌ద్ర‌తా విధులు నిర్వ‌ర్తిస్తున్న సైనికుల్లో ఆత్మ‌స్థైర్యం ఇనుమ‌డించేలా చేశారు. కేంద్ర మంత్రిగా పారీక‌ర్ చూపిస్తున్న తెగువ‌ను చూసి ఆయ‌న సొంత రాష్ట్రం గోవాకు చెందిన ప్ర‌జ‌ల ఛాతీ ఉప్పొంగిపోతోంది.

అందుకేనేమో… ఆయ‌న బ‌ర్త్‌డేను వారు వెరైటీగా నిర్వ‌హించి… ఆయ‌న‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గోవాలోని క‌లంగుటే నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ర్రాలో పారీక‌ర్ 1955 డిసెంబ‌ర్ 13న జ‌న్మించారు. పూర్వాశ్ర‌మంలో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఆయ‌న ఆ త‌ర్వాత బీజేపీతో రాజ‌కీయ తెరంగేట్రం చేశారు. నేడు ఆయ‌న 60వ జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రాండ్ వెల్క‌మ్ చెప్ప‌డంతో పాటు పారీక‌ర్‌కు త‌న జీవితంలోనే గుర్తుండిపోయేలా ఆయ‌న స్వ‌గ్రామంలో బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ వేడుక‌ల విష‌యానికి వ‌స్తే… పాక్‌పై స‌ర్జికల్ స్ట్రైక్స్ చేయించిన పారీక‌ర్‌కు సైన్యంలోని అర్జున యుద్ధ ట్యాంకులు, బోఫోర్స్ గన్స్‌… త‌దిత‌ర ఆయుధాల‌న్నీ ఆయ‌న కోసం త‌యారు చేస్తున్న కేక్‌పై ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాయి. యుద్ధ ట్యాంకులేంటీ? బ‌ర్త్ డే కేక్ పై ద‌ర్శ‌నం ఇవ్వ‌డ‌మేమిట‌ని ఆశ్య‌ర్య‌పోవాల్సిన అస‌వ‌రం లేదు. ఎందుకంటే.. స‌ద‌రు కేక్‌పై యుద్ధ ట్యాంకులు, ఆయుధాల‌ను పోలిన కేకు ముక్క‌లు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. అంతేనా… పారీక‌ర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గోవాలోని దాదాపుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు విజ‌య సంకల్ప్ యాత్ర‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక పారీక‌ర్ సొంతూరు ప‌ర్రాలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ మ‌రింత భారీ ర్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లంగుటే ఎమ్మెల్యే లోబో చెబుతున్నారు.

సొంత కామెంట్‌తో దెబ్బేసుకున్న మాజీ పీఎం!
టాటాల‌కు అగస్టా మ‌ర‌క అంటిందా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*