విమానంలోంచి మ‌హిళను లాగేశారు 

Share this News:
 
నిబంధ‌న‌ల విష‌యంలో అమెరికా అధికారులు ఎంత క‌ఠినంగా ఉంటారో తెలియ‌జెప్పేదుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. నిబంధ‌న‌లు పాటించని కార‌ణంగా అమెరికాలోని మిషిగాన్లో ఓ మ‌హిళ‌ను బ‌ల‌వంతంగా విమానం నుంచి దింపేశారు. బ్యాగేజ్ చెకింగ్‌, బోర్డింగ్ ప్రక్రియ‌ల‌ను స‌రిగా పూర్తి చేయ‌కుండానే ఆమె విమానం ఎక్కింద‌ని, దిగిపోవాల్సిందిగా అధికారులు కోరినా వినిపించుకోలేద‌ని ఎయిర్‌పోర్ట్ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో ఇద్ద‌రు అధికారులు ఆమెను లాక్కుంటూ వెళ్లి.. బ‌ల‌వంతంగా విమానం నుంచి దింపేయాల్సి వ‌చ్చింది.
అయితే ఇలా మ‌హిళ‌ను లాక్కెళ్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారిపోయి క‌ల‌క‌లం సృష్టించింది. బోర్డింగ్ ప్రక్రియ‌ను పాటించ‌నందుకే స‌ద‌రు మ‌హిళ‌ను దింపేశామ‌ని చెబుతున్న అధికారులు.. అంత‌కుమించి వివ‌రాలు ఇవ్వ‌లేదు. ఆ మ‌హిళ పేరును బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌ని అధికారులు.. ఆమెపై కేసు బుక్ చేసిన‌ట్లు చెప్పారు.
రోజా… ఈ కొత్త లింకులేందీ?
అదే నిజమైతే రాహుల్ ఆగుతాడా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*