మోదీపై రాహుల్ దాడి ప‌తాక స్థాయికెళ్లిందిగా!

Share this News:

రెండున్న‌రేళ్ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ… నాడు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధం జ‌రిగిన దాఖ‌లా లేదు. అయితే ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా బీజేపీ త‌న ప్ర‌ధాన‌మంత్రి అభ్యర్థిగా మోదీని ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే వీరిద్ద‌రూ బ‌ద్ధ శ‌త్రువులైపోయారు. మోదీ కాస్తంత హుందాగానే వ్య‌వ‌హ‌రిస్తున్నా… రాహుల్ గాంధీ మాత్రం త‌న అస‌హ‌నాన్ని ఆపుకోలేక‌పోతున్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో గానీ. ఆ త‌ర్వాత గానీ మోదీని నేరుగా టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌లు గుప్పించిన దాఖ‌లా దాదాపుగా లేద‌నే చెప్పాలి. అయితే నిన్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా స‌భ జ‌ర‌గ‌ని వైనంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ… మోదీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మోదీని అవినీతిప‌రుడిగా అభివ‌ర్ణిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి.

అయినా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికొస్తే… ”ప్ర‌ధాని అవినీతిప‌రుడు. ఈ విష‌యాన్ని నిరూపించేందుకు నా వ‌ద్ద ప‌క్కా ఆధారాలున్నాయి. నాకు అందిన స‌మాచారం అంతా ప‌క్కాగానే ఉంది. ఈ విష‌యం మోదీకి కూడా తెలుసు. నేను నోరు విప్పితే… మోదీ గుట్టు ర‌ట్టు కాక మాన‌దు. ఇదే విష‌యం తెలుసుకున్న మోదీ ఎక్క‌డ త‌న భండారం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంటులో న‌న్ను మాట్లాడ‌నీయ‌కుండా వారు అడ్డుకుంటున్నారు. అయితే పార్ల‌మెంటులో మోదీకి సంబంధించిన అవినీతి భాగోతాన్ని మాత్రం బ‌య‌ట‌పెట్టే తీర‌తా” అని రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి మోదీకి సంబంధించి ఏ విష‌యాల‌పై రాహుల్ వ‌ద్ద స‌మాచారం ఉందో? ఆ స‌మాచారాన్ని ఆయ‌న ఎప్పుడు బ‌య‌ట‌పెడ‌తారో? రాహుల్ బ‌య‌ట‌పెట్టే అంశాల‌పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో? అన్న అంశాల‌పై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయినా మోదీకి సంబంధించిన అవినీతి వ్య‌వ‌హారాల‌ను రాహుల్ కు ఎవ‌రు అందించార‌న్న విష‌యం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాబోయే సీఎం లోకేశేనంటున్న ప్ర‌త్తిపాటి
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌… నిజంగా మ‌హారాజా ప్యాలెసే!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*