చరణ్-సుకుమార్.. ఒక షాకింగ్ అప్ డేట్

Share this News:
రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ అనగానే అందరూ ఓ అల్ట్రా మోడర్న్ థ్రిల్లర్ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ సుకుమార్ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా విలేజ్ బేస్డ్ పీరియడ్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకు కథానాయికగా రాశి ఖన్నాను ఎంచుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారినట్లుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అంటున్నారు. రాశి ఖన్నా స్థానంలో అనుపమను తీసుకున్నారా.. లేక అనుపమ రెండో హీరోయినా అన్న క్లారిటీ రావాల్సి ఉంది కానీ.. ఆమె కథానాయికగా ఎంపికైన విషయం మాత్రం పక్కా అంటున్నారు. ఇదే నిజమైతే ఆశ్చర్యకరమైన వార్తే.
అనుపమ రేంజికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో.. సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం అనూహ్యమే. ఆమె అఆ.. ప్రేమమ్ లాంటి మీడియం రేంజి సినిమాల్లో మీడియం రేంజి హీరోలతోనే నటించింది. ఐతే ఆ సినిమాల్లోనూ అనుపమది విలేజ్ అమ్మాయి రోలే. ఇప్పుడు చరణ్-సుకుమార్ సినిమాలోనూ ఆమె అదే తరహా పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆరు నెలలుగా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్.. ఈ మధ్యే పని పూర్తి చేశాడట. ‘ధృవ’ పని ముగించిన చరణ్.. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ నిర్మాత ఆ పనుల్లో బిజీ కానున్నాడు. సంక్రాంతి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ఈడీ దెబ్బ‌తో జ‌గ‌న్‌కు దిమ్మ తిరిగిపోయింది!
మోదీని కేసీఆర్ ఎంత‌గా మోస్తున్నారో చూశారా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*