వర్మ ఎందుకు డెలీట్ చేశాడు?

Share this News:

రామ్ గోపాల్ వర్మ మళ్లీ మొదలుపెట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాగా తమిళ రీమేక్ ను ఎంచుకోవడంపై ఇప్పటికే ఓసారి తనదైన శైలిలో వాయించిన వర్మ.. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో మరోసారి మెగాస్టార్ మీద.. మెగా అభిమానుల మీద పడ్డాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ అద్భుతమని.. క్రిష్-బాలయ్య కలిసి తెలుగు సినిమా స్థాయిని ఎంతో పెంచారని.. వాళ్లకు సెల్యూట్ అని.. పొగిడేస్తూ తన ట్వీట్ల వర్షాన్ని ఆరంభించిన వర్మ.. ఆ తర్వాత ‘మెగా’ కెలుకుడు మొదలుపెట్టాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూశాక సంక్రాంతి వార్ వన్ సైడ్ అయిపోయిందంటూ మెగా అభిమానుల్ని కెలికిన వర్మ.. ‘‘నిజమైన కత్తి కన్నా.. మెగా షార్ప్ ట్రైలర్ ‘గౌతమీపుత్ర శాతకర్ణియే’’ అని వ్యాఖ్యానించాడు. ‘మెగా’ తరహాలో తమిళనాడు మీద ఆధారపడకుండా.. తెలుగు కథ మీదే ఆధారపడ్డందుకు క్రిష్ కు థ్యాంక్స్ అన్నాడు. నిజమైన మెగాస్టార్ అభిమానిగా.. మెగాస్టార్ శాతకర్ణి లాంటి సినిమా చేసి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలని తాను కోరుకుంటానని వర్మ వ్యాఖ్యానించాడు. నిజమైన మెగా అభిమానులు మెగాస్టార్ బాహుబలి.. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేయాలని కోరుకుంటారో లేదా మనస్ఫూర్తిగా చెప్పాలని కోరాడు. ఐతే చేయాల్సిందంతా చేసేసి.. ఈ ట్వీట్లన్నీ జనాల్లోకి వెళ్లిపోయాక అందులో కొన్నింటిని డెలీట్ చేశాడు వర్మ. ఎవరి గురించి ఏమైనా కామెంట్ చేసి ధైర్యంగా నిలబడే వర్మ ఇలా తన ట్వీట్లు డెలీట్ చేయడానికి కారణమేంటి? ఆయన మీద ఎవరి ప్రభావం పని చేసింది?

ఆ దర్శకుడి మాటలకు మిల్కీ బ్యూటీకి మండిపోయిందట..
పారీక‌ర్‌కు ఈ బ‌ర్త్‌డే వెరీ వెరీ స్పెష‌ల్‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*