తమ్ముడూ అంటే.. పవన్ చేస్తున్నట్లేనా?

Share this News:

హీరోగా మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’లో పవన్ కళ్యాణ్ క్యామియో రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. అందులో పవన్ క్యామియో అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పవన్ అన్నయ్యను మించి ఎదిగిపోయాడు. అతడి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఒక పాటలో పవన్ తళుక్కున మెరుస్తాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
‘ఖైదీ నెంబర్ 150’లో పవన్ క్యామియో గురించి ఊరికే వార్తలు రాలేదు. ఈ సినిమాలోని అమ్మడూ లెట్స్ డు కుమ్ముడు.. అనే పాటను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  అందులో ఒక చోట చిరు వాయిస్ వినిపిస్తుంది. తమ్ముడూ.. లెట్స్ డు కుమ్ముడూ అంటాడు చిరు. ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిందే అని.. ఆ మాట వచ్చే చోట పవన్ అన్నయ్యతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశముందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే ఈ చిత్రంలో ఆల్రెడీ రామ్ చరణ్ కూడా ఒక డ్యాన్స్ బిట్ చేశాడు. మళ్లీ పవన్ కూడా డ్యాన్స్ చేస్తాడా అంటే సందేహమే. ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరే ఆ తమ్ముడు అయి ఉండొచ్చేమో. లేదా చరణ్ నే తమ్ముడూ అని సంబోధించాడేమో చిరు. ఒకవేళ అక్కడ ఎవ్వరూ లేకుండానూ ఉండొచ్చేమో. తమ్ముడు అనగానే పవనే అక్కడుంటాడని ఫిక్సవడానికి మాత్రం లేదు. అలాంటి ఆశలు పెట్టుకుని.. తర్వాత పవన్ కనిపించకుంటే అభిమానులు నిరాశ చెందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఊహాగానాలు పక్కనబెట్టి సినిమా వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్.
చంద్ర‌బాబు మైండ్ ప‌వ‌ర్ ముందు అంతా బలాదూరే!
టీడీపీకి ‘వంగవీటి’ పంచ్?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*