రాహుల్‌పై మోదీ వ్యంగ్యం అదుర్స్‌!

Share this News:

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ… ఏం చేసినా అదే ఆయ‌న‌కు రివ‌ర్స్‌గా ప‌డిపోతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అవినీతిప‌రుడిగా అభివ‌ర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య‌లు… ఆయ‌న‌పైకే వ‌చ్చి ప‌డ్డాయి. మోదీ అవినీతికి పాల్ప‌డ్డారని, ఆ ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెడితే… పార్ల‌మెంటులో భూకంపం వ‌చ్చి తీరుతుంద‌ని రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ అంత‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. ఎందుకంటే… రాహుల్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అస‌లు ఆరోప‌ణ‌లే కాద‌న్న‌ది ఆ పార్టీ భావ‌న‌గా క‌నిపించింది. ఇక బీజేపీ సైలెన్స్‌ను ఆస‌రా చేసుకుని నిన్న రాహుల్ గాంధీ… నిన్న మోదీపై అవినీతి వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌ను నిన్న‌నే బీజేపీ తిప్పికొట్టినా… మోదీ స్పందించ‌లేదు. తాజాగా నేటి మ‌ధ్యాహ్నం రాహుల్ ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన మోదీ… త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మోదీపై రాహుల్ గాంధీ చేసిన‌ట్లుగా చెబుతున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌ను గ‌తంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసింద‌ట‌. ఇదే విషయాన్ని ప్ర‌స్తావించిన మోదీ… అస‌లు విష‌యం తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నార‌ని చుర‌కలు అంటించారు. అంతేకాకుండా రాహుల్ అమాయ‌కుడ‌ని, మాట‌లు రాని నేత‌గా మోదీ ఆయ‌న‌ను అభివ‌ర్ణించారు. రాహుల్‌పై మోదీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే… మోదీ ఏ మేర రాహుల్ పై సెటైర్లు విసిరారో ఇట్టే తెలిసిపోతుంది. మోదీ వ్యంగ్యాస్త్రాల‌ను ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే… ‘‘మనకు కొందరు యువ రాజకీయ నేతలు ఉన్నారు. ఒక యువ రాజకీయ నేత ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు. ఆయన మాట్లాడటం ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటున్నారు. నా ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది. అయితే.. ఆయన మాటలకు భూకంపం రాలేదని సంతోషంగా ఉంది’’ అంటూ రాహుల్ పేరు ఎత్తకుండానే మోదీ ఎన్ని చురకలు వేయాలో అన్ని చురకలు వేసేశారు.

చింత‌మ‌నేని తీరు మార‌లేదండోయ్‌!
తెలుగోడి ప్లేస్‌లో త‌మిళ మహిళ నియామ‌కం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*