టీడీపీకి ‘వంగవీటి’ పంచ్?

Share this News:

టాలీవుడ్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన సినిమాల్లో ఒకటవుతుందని భావిస్తున్న ‘వంగవీటి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా నేపథ్యం.. ట్రైలర్లో సన్నివేశాలు చూశాక.. అసలీ సినిమా విడుదలకు నోచుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ సినిమా యధావిధిగా విడుదలకు సిద్ధమైపోయింది. వంగవీటి రంగా హత్య విషయంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి.. ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు. మీడియాలో కూడా ఎక్కడా కూడా దీని గురించి వాస్తవాలు రాయరు. అలాంటి అంశాల జోలికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే అందరూ దాన్ని విస్మరిస్తారు.


ఐతే వంగవీటి రంగా హత్య జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు ‘వంగవీటి’ సినిమాతో నిప్పు రాజేస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో వర్మ ఎవరిని ఎలా చూపించాడు.. రంగా హత్యకు సంబంధించిన సన్నివేశాన్ని ఎలా తీర్చిదిద్దాడు.. ఆ హత్యకు బాధ్యులుగా ఎవరిని చూపిస్తున్నాడు అన్నది ఆసక్తికరం. దీనిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘వంగవీటి’ రిలీజ్ ట్రైలర్ చూస్తే తెలుగుదేశం నాయకుల్లో కొంచెం గుబులు రేగే ఉంటుంది. ఇందులో ఒక చోట తెలుగుదేశం జెండాను చూపించారు. రంగా హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సినిమాలో ఆ పార్టీ నేతల్ని నెగెటివ్ గా చూపించి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ రౌడీ రాజకీయాల చరిత్ర తెలిసిన వాళ్లందరూ కూడా ‘వంగవీటి’ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలడం ఖాయమని భావిస్తున్నారు. మరి సినిమాలో అసలు వర్మ ఏం చూపించాడో చూద్దాం.

తమ్ముడూ అంటే.. పవన్ చేస్తున్నట్లేనా?
రాహుల్‌పై మోదీ వ్యంగ్యం అదుర్స్‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*