చంద్ర‌బాబు మైండ్ ప‌వ‌ర్ ముందు అంతా బలాదూరే!

Share this News:

నిజ‌మా… 65 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబు మైండ్ ప‌వ‌ర్ అంత‌గా ఉందా? అంటే… అవున‌నే చెప్పాలి. మూడు ద‌శాబ్దాలకు పైగా వ‌య‌సు క‌లిగిన టీడీపీకి అధినేత‌గా, ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా… ఆ త‌ర్వాత న‌వ్యాంధ్ర‌కు మ‌రోమారు ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు జ్ఞాప‌క శ‌క్తి అమోఘ‌మ‌నే వాద‌న‌లో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర ప‌రిపాన‌లోనే కాకుండా దేశం పాల‌న‌లోనూ కీల‌క భూమిక పోషించ‌డ‌మే కాకుండా ఆయా స్థాయిల్లో విధాన నిర్ణ‌యాల్లో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఐఏఎస్ ల మైండ్ ప‌వ‌ర్ కూడా చంద్ర‌బాబు ముందు దిగ‌దుడుపేన‌న్న మాట వింటేనే కాస్తంత డౌటు వస్తుంది. అయితే విజ‌య‌వాడ‌లో గ‌డ‌చిన రెండు రోజులుగా జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్‌లో నిన్న చోటుచేసుకున్న ఓ చిన్న సంఘట‌న‌ను చూస్తే మాత్రం… చంద్ర‌బాబు మైండ్ ప‌వ‌ర్ ముందు ఒక్క ఐఏఎస్‌లేం ఖ‌ర్మ‌… ఎంత‌టి ఐక్యూ ఉన్న వారైనా దిగ‌దుడుపేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక ఆ చిన్న ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే… క‌లెక్ట‌ర్ల‌తో భేటీ సంద‌ర్భంగా పేద‌ల‌కు క‌ట్టించ‌నున్న ఇళ్ల గురించి ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు… స‌ద‌రు ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సిమెంటును ఎర్ర బ్యాగుల్లో త‌క్కువ ధ‌ర‌కే అందించాల‌ని ఆయా సిమెంటు కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేశాం క‌దా అని చంద్ర‌బాబు స‌ద‌రు జీవోను గుర్తు చేశారు. అయితే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు అడ్డు త‌గిలిన ప‌లువురు ఐఏఎస్‌లు స‌ద‌రు బ్యాగుల క‌ల‌ర్ ఎరుపు కాద‌ని, న‌లుపు అని స‌వరించే య‌త్నం చేశారు. దీంతో ఏమాత్రం ఆలోచించ‌కుండానే చంద్ర‌బాబు… స‌ద‌రు అధికారుల వైపు చూసి… ”ఓ సారి ఫైళ్లు తిర‌గేయండి… మీకే తెలుస్తుంది” అని సూటిగా ఆదేశించారు.

చంద్ర‌బాబు ఆదేశాల‌తో అప్ప‌టిక‌ప్పుడు త‌మ వెంట తెచ్చుకున్న ఫైళ్ల‌ను తెరిచి ప‌రిశీలించిన ఐఏఎస్‌లు… ”అవునండి… ఆ బ్యాగుల క‌ల‌ర్ ఎరుపే”న‌ని చెప్పారట‌. దీంతో అక్క‌డ ఉన్న మిగిలిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కేబినెట్ మంత్రులు, ఇత‌ర అధికారులు బిత్త‌ర‌పోయార‌ట‌. ఎందుకంటే… ఏదో జీవోలో పేర్కొన్న చిన్న అంశాన్ని కూడా చంద్ర‌బాబు అంత బాగా గుర్తు పెట్టుకొని చెప్పారంటే మాట‌లు కాదుగా. అది కూడా స‌ద‌రు జీవోను త‌యారు చేసిన ఐఏఎస్‌లే ఆ క‌ల‌ర్ న‌లుప‌ని చెప్పిన‌ప్ప‌టికీ… ఆ బ్యాగుల క‌ల‌ర్ ఎరుపేన‌ని వారికే గుర్తు చేశారంటే… వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబు జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం కాదు క‌దా… ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతోంద‌నే చెప్పాలి.

ప‌వ‌న్‌పై వ‌ర్మ‌కు ఈ రేంజి అభిప్రాయ‌ముందా?
తమ్ముడూ అంటే.. పవన్ చేస్తున్నట్లేనా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*