ముఖ్యమంత్రిని సన్మానించిన కృష్ణాడెల్టా రైతులు

Share this News:

పట్టిసీమ ద్వారా నీరందించి కృష్ణా డెల్టాను కాపాడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉండవల్లి నివాసంలో కలిసి ఆయన్ను డెల్టా రైతులు సన్మానించారు. జిల్లా మంత్రులు దేవనినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నానితో పాటు జిల్లా తెలుగు రైతు సంఘం నాయకులు, రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు తెలియజేశారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు 55.6 టీఎంసీల నీరు అందించారు. ఫలితంగా కృష్టా డెల్టాలో 2 లక్షల 20 వేల హెక్టార్లో వరి పండించడం ద్వారా 13 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రదరబాబు నాయుడే కారణమని ఆయన్ను కృష్ణా జిల్లా తెలుగు రైతు సంఘం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జనలవనరుల శాక మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అపర భగీరథుడుగా అభివర్ణించారు. కాటన్ మహాశయుడు గోదావరిపై ఆనకట్ట నిర్మిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా డెల్టా రైతాంగాన్ని కాపాడరన్నారు. పులిచింతల ఎగువ నుంచి నీరు రాకపోయినా పట్టిసీమ నుంచి డెల్టాకు 55 టీఎంసీల నీరందించామన్నారు. పట్టిసీమ నుంచి నీరు అందించకపోతే డెల్టా పరిస్థితి దారుణంగా ఉండేదని, సీఎం ముందుచూపుతోనే పట్టిసీమను సకాలంలో పూర్తిచేసి నీరందించారన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పామర్రు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్గ రామయ్య ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, బోడే ప్రసాద్, కాగిత వెంకట్రావు, పలువురు రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

నోట్ల ర‌ద్దుపై ఫోర్బ్స్‌, వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్స్ ఏమ‌న్నాయంటే?
లేటు వ‌య‌సులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఘాటు ప్రేమ‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*