రాహుల్ కూడా బూమ‌రాంగ్ అయ్యారే!

Share this News:

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా బూమ‌రాంగ్ అయిపోయారండోయ్‌. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ఓ రేంజిలో విరుచుకుప‌డ్డ రాహుల్‌,,, ఆయ‌న‌ను ఏకంగా అవినీతిపరుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ అవినీతికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెడితే.. పార్ల‌మెంటులో భూకంపం వ‌స్తుంద‌ని చెప్పిన రాహుల్‌… పెద్ద సంచ‌ల‌న‌మే రేపారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంటులో అయితే ఆయ‌న ఆ వివ‌రాలు వెల్లడించ‌లేక‌పోయారు గాని.. మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో వాటిని బ‌య‌ట‌పెట్టారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోని మోదీ… ఆయ‌న‌ను చిన్న పిల్లోడి కింద లెక్క క‌డుతూ… రాహుల్ కూడా మాట్లాడ‌టం నేర్చుకుంటున్నార‌ని సెటైర్లు వేశారు. ఈ క్ర‌మంలో నిన్న బీజేపీ రాహుల్ వ్యాఖ్య‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

మోదీ అవినీతికి పాల్ప‌డ్డారంటూ రాహుల్ బ‌య‌ట‌పెట్టిన స‌హారా ముడుపుల జాబితానే ఆధారంగా తీసుకుని వాటితోనే ఆయ‌న‌ను బూమ‌రాంగ్ చేసేసింది. స‌ద‌రు జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఢిల్లీ సీఎంగా 15 ఏళ్ల పాటు వ్య‌వ‌హ‌రించిన షీలా దీక్షిత్ పేరు కూడా ఉంద‌ని బీజేపీ ఆస‌క్తిక‌ర అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది. స‌హారా ముడుపుల జాబితాలో షీలాకు 2013లో ఏకంగా రూ.1 కోటి అందింద‌ట‌. దీంతో రాహుల్ స‌హా కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా కంగు తినాల్సి వ‌చ్చింది. అస‌లే దేశంలోనే కీల‌క రాష్ట్రంగా భావిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి షీలాను కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించుతోంది. ఈ నేపథ్యంలో స‌హారా ముడుపుల వ్య‌వ‌హారంలో షీలా పేరున్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన బీజేపీ… గ్రాండ్ ఓల్డ్ పార్టీని చిక్కుల్లోకి నెట్టింది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా… స‌హారా ముడుపుల జాబితాల‌ను బ‌య‌ట‌కు తీసిన బీజేపీ… అటు రాహుల్ గాంధీ నోరు మూయించ‌డంతో పాటు ఇటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో త‌న‌కు మంచి ఆయుధాన్ని చేజిక్కించుకున్న‌ట్లైంది.

జ‌గ‌న్ ‘జైలు’ తులాభారానికి మూడేళ్లు ప‌ట్టిందా?
తెలంగాణ‌లో టీడీపీకి బ‌లం త‌గ్గ‌లేదుగా!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*