చిరు.. అచ్చం చ‌ర‌ణ్ లాగా

Share this News:
‘బ్రూస్ లీ’ సినిమా చివ‌ర్లో కొస‌మెరుపులా ఎంట్రీ ఇచ్చిన చిరును చూసి.. ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘‘అచ్చం మీరు మా బ్రూస్ లీ లాగానే మాట్లాడుతున్నారే’’ అంటుంది. అది చూసి చిరు.. ‘ఎలాగెలాగా’ అంటూ వెట‌కార‌మాడ‌తాడు. అప్పుడు ర‌కుల్ స‌ర్దుకుని ‘‘బ్రూస్ లీనే మీలా మాట్లాడ‌తాడు’’ అంటూ క‌వ‌ర్ చేస్తుంది. కొడుకు తండ్రిలా ఉంటాడు.. తండ్రిని అనుకరిస్తాడు త‌ప్ప‌.. కొడుకులా తండ్రి ఉండ‌టం.. కొడుకును తండ్రి అనుకరించ‌డం ఉండ‌దు. ఎప్పుడైనా చ‌ర‌ణ్ లో చిరు పోలిక‌ల గురించి మాట్లాడుకోవాలి కానీ.. చిరులో చ‌ర‌ణ్ పోలిక‌ల గురించి చ‌ర్చ ఉండ‌దు. కానీ తాజాగా రిలీజ్ చేసిన‌ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ పోస్ట‌ర్ చూస్తే మాత్రం సీన్ రివ‌ర్స్ అనిపిస్తోంది.
ఈ పోస్టర్లో కాజల్ తో జోడీ కట్టిన చిరు అచ్చం చరణ్ లాగా ఉండటం విశేషం. ఉద్దేశపూర్వకంగా అలా పోజిచ్చాడో.. యాదృచ్ఛికంగా అలా వచ్చిందో కానీ.. సడెన్ గా చూస్తే అక్కడున్నది చరణ్ ఏమో అన్న సందేహం కలుగుతుంది. అలా కొడుకును తలపిస్తున్నాడు చిరు. గత ఏడాది వరకు ఒకలా ఉన్న చిరు.. తన రీఎంట్రీ మూవీ కోసం షేపుల్ని బాగానే మార్చుకున్నాడు. కనీసం పదేళ్ల వయసు తగ్గి కనిపిస్తున్నాడు. ఆయన లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో చిరు తన ఎనర్జీతో మరింతగా సర్ప్రైజ్ చేస్తాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. చూద్దాం రాబోయే సంక్రాంతికి చిరు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో!
త‌మిళ‌నాడులో క‌ల‌క‌లంః సీఎస్‌కు ప్రాణ‌హాని
గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ ఫుల్ వీడియో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*