లేదు లేదంటూనే క్రిష్ అంచనాలు పెంచేశాడే..

Share this News:

‘గౌతమీపుత్ర శాతకర్ణి మొదలైన రోజే మాంచి హైప్ తెచ్చుకుంది. ప్రారంభోత్సవం అంత ఘనంగా చేశారు మరి. ఆ తర్వాత ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్ చూశాక ఎవరికీ మాటలు రాలేదు. ఓ అద్భుతమైన విజువల్ వండర్ ను తెరమీద చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగించింది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్. సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే భారీగా అంచనాల్ని మరింత పెంచే వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు క్రిష్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో తానో గొప్ప సినిమా తీశానంటూ పదే పదే చెప్పాడు క్రిష్.

మామూలుగా క్రిష్ తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ మొదట్నుంచి అతను కామ్ గానే ఉన్నాడు. కానీ ఆడియో వేడుకలో మాత్రం చాలా ఎమోషనల్ గా.. సినిమా గురించి గొప్పగా మాట్లాడాడు. తన తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు జన్మనిచ్చినందుకు గర్వించేలా ఈ సినిమా తీశానన్నాడు. ఆ తర్వాత భార్య ప్రస్తావన తెస్తూ.. నువ్వు నేను గర్వించేలా సినిమా ఉంటుందన్నాడు. అంత అద్భుతంగా సినిమా ఉంటుందన్నాడు. తాను ఈ మాటలు సినిమా మీద అంచనాలు పెంచడానికో.. జనాలతో ఎక్కువ టికెట్లు కొనిపించడానికో ఈ మాటలు చెప్పట్లేదని కూడా క్రిష్ చెప్పడం విశేషం. క్రిష్ అలా అన్నప్పటికీ అతను చెప్పిన మాటలతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయన్నది వాస్తవం.

ఆ దర్శకుడి మాటలకు మిల్కీ బ్యూటీకి మండిపోయిందట..
చిరు.. అచ్చం చ‌ర‌ణ్ లాగా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*