ఆ దర్శకుడి మాటలకు మిల్కీ బ్యూటీకి మండిపోయిందట..

Share this News:
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం… తెలుగు సినిమాలు హీరోలు చుట్టూ తిరుగుతాయి.. అందులో హీరోయిన్ అంటే ఒక ఆట బొమ్మ మాత్రమే. ఆడి, పాడి ఆనందింపజేయడమే ఆమె రోల్.. అంతకుమించి నటించేంత సీనేమీ వారికి ఉండడం లేదు. ఎవరిని అడిగినా ఇప్పుడు ఇదే చెబుతారు.. కానీ, ఉన్న మాటంటే ఉలుకెక్కువన్నట్లుగా మన అందాల భామలు ఆ మాటలను అస్సలు అంగీకరించడం లేదు. తాజాగా ఓ తమిళ దర్శకుడు అదే మాట అంటే మిల్కీ బ్యూటీ తమన్నా తెగ హర్టయిపోయిందట. ఆ దర్శకుడు క్షమాపణ చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేస్తోంది.
‘‘ఎంత రెమ్యునరేషన్ ఇస్తే అంత ఎక్స్ పోజింగ్ చేస్తారు. ఎలాంటి బట్టలైనా వేసుకుంటారు’’ అని సూరజ్ అనే తమిళ దర్శకుడు వ్యాఖ్యానించడం దుమారం రేపింది. విశాల్- తమన్నా జంటగా రీసెంట్ గా రిలీజైన ”ఒక్కడొచ్చాడు” మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సూరజ్.. తమన్నా గ్లామర్ డోస్ ఎక్కువైందనుకుంటా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో హీరోయిన్స్ గురించి కాస్త టంగ్ స్లిప్పయ్యాడు. ”వాళ్లని తీసుకునేదే ఎక్స్ పోజింగ్ కోసం.. అమ్మాయిల్ని ఎంత పొట్టి బట్టల్లో చూపిస్తే మాస్ ఆడియెన్స్ అంత థ్రిల్ అవుతారు.. కాస్ట్యూమ్ డిజైనర్స్ తో నేను కావాలనే షార్ట్ డ్రెస్ లు డిజైన్ చేయిస్తా.. యాక్టింగ్ స్కిల్స్ సీరియల్స్ లో చూపించుకోమనండి..కమర్షియల్ మూవీస్ లో చేయాలంటే ఎక్స్ పోజింగ్ తప్పనిసరి” అంటూ హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడేశాడు. దీంతో తమన్నా, నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు ఆయనపై ఫైరవుతున్నారు.
నయనతార అయితే.. సూరజ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఓ వైపు పింక్.. దంగల్ అంటూ సినిమాలు తీస్తూ మహిళా సాధికారత గురించి తీస్తారు, మరోవైపు ఇలా నిజ స్వరూపం బయటపెట్టుకుంటారంటూ వాయించేసింది. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తేనే హీరోయిన్స్ షార్ట్ డ్రెస్ లు వేసుకుంటారే తప్ప డబ్బుకి ఆశపడి కాదంటూ తేల్చి చెప్పింది.  ఇంకోసారి హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఒక‌డొచ్చాడులో హీరోయిన్ గా న‌టించిన త‌మ‌న్నా ఒక అడుగు ముందుకేసి ‘దంగల్ సినిమా చూస్తూ దియేటర్లో నుండి ఈ కామెంట్లు గురించి తెలుసుకుని బయటకు వచ్చేశాను. సూరజ్ మాటలు బాధను కలిగించాయి. కోపం తెప్పించాయి. నాకే కాదు.. మొత్తంగా సినిమాల్లో ఉన్న అమ్మాయిలందరికీ కలిపి సూరజ్ క్షమాపణలు తెలపాల్సిందే. ఇక్కడకు నటించడానికి వచ్చాం తప్పితే.. వేరే వాటికి కాదు. ఆటవస్తువులుగా చిత్రీకరిస్తే ఊరుకునేదే లేదంటూ మండిపడింది.
రాష్ట్రప‌తికి విందు… బాబు కేసీఆర్ ప్ర‌త్యేక‌ ముచ్చ‌ట్లు
లేదు లేదంటూనే క్రిష్ అంచనాలు పెంచేశాడే..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*