బ్రిట్నీని చంపేసిన సోనీ!

Share this News:

పాప్ స్టార్ బ్రిట్నీ స్పియ‌ర్స్ పాటందుకుంటే విశ్వ‌వ్యాప్తంగా సంగీత ప్రియులు కేరింత‌లు కొట్టాల్సిందే. త‌న గ‌ళానికి తొడు కదం తొక్కుతూ త‌న హ‌స్కీ వాయిస్‌తో జ‌నాన్ని మైమ‌ర‌పింపజేస్తున్నారు. అలాంటి బ్రిట్నీ ఇక లేదంటే… ప్ర‌పంచం మొత్తం దిగ్భ్రాంతికి గురి కావ‌డం ఖాయం. ప్ర‌త్యేకించి కుర్ర‌కారు శోక‌సంద్రంలో మునిగిపోతారు.

మ‌రి అలాంటి బ్రిట్నీని బ‌తికుండ‌గానే చంపేసింది సోని. సోనీ అంటే వ్య‌క్తి కాదు… సంగీత ప్రియుల‌కు వీనుల‌విందైన సీడీలు అందించే సోనీ మ్యూజిక్‌. బ్ర‌ట్నీ చ‌నిపోయిందంటూ సోనీ మ్యూజిక్ త‌న అఫీసియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. ఈ విష‌యం తెలుసుకున్న మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఒక్క‌సారిగా షాక్ తిన్నారు.

అయితే బ్రిట్నీ ఇంకా బ‌తికే ఉంద‌ని, త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో త‌ప్పుడు ట్వీట్ పోస్టైంద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పేసిన సోనీ మ్యూజిక్… జ‌రిగిన త‌ప్పుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ… మ‌రో ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే తాను చ‌నిపోయిన‌ట్లు సోనీ మ్యూజిక్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టైన ట్వీట్‌పై బ్రిట్నీ నేరుగా స్పందించ‌లేదు. ఆమె మెనేజ‌ర్ దీనిపై స్పందిస్తూ… బ్రిట్నీ బ‌తికే ఉన్నార‌ని, ఆమె క్షేమంగానూ ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. అయితే…ఈ బూటకపు ట్వీట్లను తామే చేశామని సైబర్ హ్యాకింగ్ గ్రూప్ ‘అవర్‌మైన్’ ప్రకటించింది.

గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ ఫుల్ వీడియో
ఆ చాయ్ వాలా బిజినెస్ 1,300 కోట్లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*