‘క్యాష్‌లెస్‌’లో కృష్ణా జిల్లా టాప్ లేపిందండోయ్‌!

Share this News:

న‌ల్ల‌ధ‌నానికి చెక్ పెట్టేందుకంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో జ‌న‌మంతా న‌గ‌దు ర‌హిత చెల్లింపుల దిశ‌గా మార‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా క్యాష్ లెస్ చెల్లింపుల దిశ‌గా జ‌నాన్ని మ‌ళ్లించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఇందులో భాగంగా క్యాష్ లెస్ చెల్లింపుల‌ను పెంచేందుకు ఏ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకోవాలో సూచించాలంటూ న‌వ్యాంధ్ర సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలో ఓ అత్యున్న‌త స్థాయి క‌మిటీని కేంద్రం నియ‌మించింది. ఇప్ప‌టికే ఈ క‌మిటీ ముంబైలో తొలి భేటీ నిర్వ‌హించింది. ఈ భేటీలో డెబిట్‌, క్రెడిట్ కార్డుల చెల్లింపుల‌పై విధిస్తున్న ప‌న్నును నామ‌మాత్రం చేస్తే బాగుంటుందంటూ కేంద్రానికి, ఆర్బీఐకి ఓ కీల‌క సూచ‌న చేసింది.

క్యాష్ లెస్ క‌మిటీ చైర్మ‌న్ త‌న వ‌ద్దే ఉంటున్నార‌నుకున్నారో… ఏమో.. తెలియ‌దు కాని… కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.బాబు… క్యాష్‌లెస్ చెల్లింపుల దిశ‌గా జిల్లాను ప‌రుగులు పెట్టించారు. రేష‌న్ షాపుల నుంచి షాపింగ్ మాల్స్ దాకా… సినిమా థియేట‌ర్ల నుంచి బ‌డా కంపెనీల దాకా అన్నింటా క్యాష్ లెస్ చెల్లింపులు ఊపందుకునే ఆయ‌న చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. క్యాష్ లెస్ చెల్లింపుల‌ను మ‌రింత‌గా పెంచేందుకు ఆయ‌న ఏకంగా ఓ వ్య‌వ‌స్థ‌నే రూపొందించార‌ట‌.

దీంతో క్యాష్ లెస్ చెల్లింపుల విష‌యంలో కృష్ణా జిల్లా దేశంలోనే టాప్ స్థానంలో నిలిచింది. ఈ మేర‌కు నేడు ఢిల్లీలో జ‌రగ‌నున్న ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో… క్యాష్ లెస్ చెల్లింపుల దిశ‌గా జిల్లాను అగ్ర‌స్థానంలో నిలిపిన ఏ.బాబును ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌త్క‌రిస్తార‌ట‌. అంతేకాదండోయ్‌… క్యాష్ లెస్ చెల్లింపుల దిశ‌గా ఏ.బాబు చేపట్టిన చ‌ర్య‌ల‌ను కీర్తించ‌నున్న మోదీ ఆయ‌న‌కు ఓ అవార్డును కూడా ప్ర‌దానం చేస్తార‌ట‌.

ఖైదీ నెంబర్ 150.. రిలీజ్ డేట్ ఫిక్స్!
న‌వ్యాంధ్ర ప్ర‌జ‌ల‌కు బాబు విలువైన కానుకిచ్చేశారు!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*