ఖైదీ నెంబర్ 150.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Share this News:

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’.. నందమూరి బాలకృష్ణ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి రిలీజవుతాయన్న సంగతి తెలిసిందే. కానీ కచ్చితమైన రిలీజ్ డేట్లు ఏవన్నదే క్లారిటీ లేదు. ఏది ముందు వస్తుంది.. ఏది వెనుక వస్తుంది అనే విషయంలో కొన్ని రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. ఇద్దరూ కూడా ముందు ఒకరు డేటిస్తే దాన్ని బట్టి తాము డేట్ ఫిక్స్ చేద్దామని చూస్తున్నారు. మొన్నటి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకతో ఒక క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు కానీ.. జస్ట్ సంక్రాంతి రిలీజ్ అన్న రొటీన్ మాటనే వల్లె వేసి కార్యక్రమం ముగించేసింది ‘శాతకర్ణి’ టీం. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదని ‘ఖైదీ నెంబర్ 150’ టీమే ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధమైపోయింది.

చిరు సినిమానే ముందుగా థియేటర్లలోకి దిగుతుందనేది తాజా సమాచారం. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. పదో తారీఖున అమెరికాలో ప్రిమియర్ల కోసం ఇప్పటికే టాక్స్ మొదలైపోయాయని.. ఏర్పాట్లు చేసుకోమని చెప్పేశారని తెలుస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11కు ఫిక్స్ అయితే.. ఆ తర్వాతి రోజు జనవరి 12న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తేవాలని చూస్తున్నారు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని వాడుకోవాలని ఇరు సినిమాల నిర్మాతలూ భావిస్తున్నారు. ముందు రెండు సినిమాల మధ్య ఎడం ఉంటే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక రోజు వ్యవధిలో సినిమాలు వచ్చేసేలా కనిపిస్తోంది. 11.. 12 తేదీలకే ఈ భారీ సినిమాలు వచ్చేయడం ఖాయమైతే 14న రానున్న ‘శతమానం భవతి’కి కలిసొచ్చే విషయమే.

నయనతారకు మాత్రమే ఇలా సాధ్యం
‘క్యాష్‌లెస్‌’లో కృష్ణా జిల్లా టాప్ లేపిందండోయ్‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*