నయనతారకు మాత్రమే ఇలా సాధ్యం

Share this News:

హీరోయిన్‌ గా రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించేసింది నయనతార. అప్పట్నుంచి ఎన్నడూ ఆమె జోరు తగ్గింది లేదు. ఐతే హీరోయిన్లు ఎంత హవా సాగించినా.. అది మహా అయితే ఆరేడేళ్లు మాత్రమే. 30 ప్లస్ లో పడ్డారంటే ఏ హీరోయిన్ అయినా చరమాంకానికి వచ్చేసినట్లే. కానీ నయనతార మాత్రం అందుకు మినహాయింపు. 30ల్లో పడ్డాకే ఆమె జోరు మరింత పెరిగింది.

గత ఏడాది తనీ ఒరువన్.. మాయ.. నానుమ్ రౌడీదా.. ఇలాంటి సూపర్ హిట్లు కొట్టి హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకుంది నయన్. ఈ ఏడాది అటు తమిళంలో.. ఇటు తెలుగులో కలిపి అరడజను సినిమాల్లో నటించింది నయన్. వచ్చే ఏడాదికి ఇంకో అరడజను సినిమాలు రెడీ అవుతున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతోంది నయన్.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ నిర్మించబోయే భారీ ప్రాజెక్టులో నయనతారే కథానాయిక. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇది ఒక థ్రిల్లర్ కథాంశమట. ఈ చిత్రం మెజారిటీ పార్ట్ షూటింగ్ ఐరోపాలోనే జరుగుతుందట. ఆల్రెడీ ‘డోర’ అనే హార్రర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న నయన్.. ఇంకో థ్రిల్లర్ మూవీని లైన్లో పెట్టేసింది.

2 వేల నోటుతో అనారోగ్యం
ఖైదీ నెంబర్ 150.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*