పొలిటికల్ పార్టీలపై సుప్రీం పంచ్

Share this News:

రాజకీయాలకు కులమతాలకు ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు, ఇండియాలో మాత్రమే ఉన్నదీ కాదు. కానీ… అది చేస్తున్న చేటు అంతాఇంతా కూడా కాదు. ఇండియాలో ఇప్పుడు రాజకీయాలన్నవి లేనేలేవు.. ఉన్నదంతా కుల రాజకీయాలు, మత రాజకీయాలు. సుప్రీం కోర్టు ఇప్పుడు ఇలాంటి కుల, మత రాజకీయాలపై కన్నెర్ర చేసింది. ఓట్లు అడిగేందుకు కులమతాలను వాడుకోవడం కరెక్టు కాదని చెప్పింది. అంతేకాదు.. కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేయవద్దంటూ రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

రాజకీయ పార్టీలు కానీ, నేతలు కానీ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లను అడగరాదంటూ హెచ్చరించింది. కులాలను, మతాలను దుర్వినియోగం చేయడం కూడా అవినీతి కిందకే వస్తుందని తెలిపింది. హిందుత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తులతో కూడా రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారించింది. కులం, మతం అనేవి మన లౌకిక విధానంలో ఒక భాగమని… వీటికి అతీతంగానే ఎన్నికలు జరగాలని ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.

మతం అనేది భగవంతుడికి, మనిషికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. ఇందులో ప్రభుత్వాల ప్రమేయం ఎంతమాత్రం ఉండరాదని తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘హిందుత్వ’ తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పున:సమీక్షించి తీర్పిచ్చింది.

జ‌గ‌న్ ఎవ‌రు చెప్పినా విన‌ర‌ట‌!
ఆ లింకు వచ్చిందా.. మీ ఫోను గోవిందా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*