భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశి..

Share this News:
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు  పోటెత్తారు దీంతో తిరుమలలో 16 కంపార్టమెంట్లు భక్తులతో నిండిపోయాయి.  ద్వాదశి రోజు ఆలయం మూసివేత వరకూ భక్తులకు ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు.అర్ధ రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామును 4 గంటల వరకు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోగా 4.10 నుంచి సామాన్య భక్తుల సర్వదర్శనం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి,తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ సీఎం రమేష్‌ స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ లోని  మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బాపట్లలోని క్షీర భావన్నారాయణ ఆలయంలో. తణుకు,సింహాచలం నరసింహస్వామి , వెంకటేశ్వర స్వామి  తెలంగాణలోని భద్రచలం రామాలయాల్లో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు..
నెల్లూరు జిల్లాలో భూ కంపం ఎందుకొచ్చిందో !
ఏపీ సీఎం శ్రీలంక టూర్

Share this News:
All arrangements have been made for the smooth conduct of Vaikunda Ekadasi festival

Leave a comment

Your email address will not be published.

*