పండుగకి ఊరెళ్ళగలరా..!

Share this News:

సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్ళలో అత్యంత ప్రాధాన్యత వున్నదే కాదు దీపావళి తర్వాత ఇంటిల్లిపాది ఆనందం తో కొత్త అల్లుళ్ళ తో బంధు మిత్రులతో జరుపుకొనే పండుగ సంక్రాంతి మరి అలాంటి పండుగను ఆనందంగా జరుపుకొనే అవకాశం వుందా ..ఎక్కడో అమెరికా నుంచి ఐన ఈజీ గా భారత దేశం రావచ్చేమో కానీ హైదరాబాద్ నుంచి సొంత వూరు ఈ పండుగకి వెళ్లడం మళ్ళీ హైదరాబాద్ రావడం కష్టం అనుకొనేలా వుంది ఇక్కడి పరిస్థితి ప్రస్తుతం . వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, స్వయంఉపాధి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సొంతూరికి వెళ్లి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. సొంతూరు వెళ్ళాలి అంటే మారేలా ?. ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రైవేటును బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు . ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు ఆనందం లేకుండా చేస్తున్నారు. ఆపరేటర్లు వెళ్లిన వాళ్ళు తిరిగి రాక తప్పదు కాబట్టి గత్యంతరం లేక అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీ కూడా తక్కువేం తినలేదు ప్రధాన మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతూ అధిక మేర ఛార్జీలు వసూలు చేస్తోంది.

ఇక ప్రైవేటు ఆపరేటర్లు ను అడిగే వాడే లేడు.అవకాశం ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలన్న లాజిక్ వర్కౌట్ చేస్తున్నారు .రాజధాని ప్రాంతంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు, అధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చి విజయవాడ, వెలగపూడి కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉద్యోగులు హైదరాబాద్‌ వెళ్లి కుటుంబసభ్యులతో కలసి సొంతూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనలు తుంగలో తొక్కి ఎలా వసూలు చేస్తున్న అడిగేవాళ్ళు లేరు .

రాయలసీమతోపాటు ఉత్తరాంధ్రకు వెళ్లే బస్సులకు విపరీతమైన డిమాండు,రాయలసీమ వైపు వెళ్లే రైళ్లు కూడా నిండిపోవడంతో బస్సులపై ఒత్తిడి పెరిగింది. ప్రైవేటు ఆపరేటర్లతో పోల్చితే కొంత తక్కువ ధరలకే బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అంటున్నా సామాన్యుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఇంత కష్ట పడాల్సి రావడం శోచనీయం.ప్రభుత్వం ఈ దోపిడీని అడ్డుకొనేందుకు చర్యలు తీసుకోవాలి ..పండుగ గాకు ఇంటికి వెళ్తున్నామని సంతోషం కంటే ఈ దోపిడీ కి గురయ్యామ అనే ఆవేదనే బాధిస్తుంది అనేది నిజం ..

సముద్రంమధ్య లో ఆలా చేస్తారా .!
వైకుంఠ ఏకాదశి రోజు ఇలాఉంటే మంచిదట

Share this News:

Leave a comment

Your email address will not be published.

*