లాటరీ ద్వారా రాయపూడి రైతులకు ప్లాట్లు పంపిణి

Share this News:

తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం రాయపూడి రైతులకు ప్లాట్లు కేటాయించారు,. ముఖ్యఅతిథిగా తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ హాజరయ్యారు. జరీబు, మెట్ట సంబంధించి కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెక్నికల్‌ కమిటీ వేసి నిర్ధారణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే రైతులకు సూచించారు. మొదట చేసిన సర్వే కాకుండా మరలా కొత్తగా కమిటీ వేయటం జరిగిందని దాని ప్రకారం న్యాయం చేయటం జరుగుతుందని రైతులకు ఎమ్మెల్యే తెలిపారు. జరీబు భూములకు ఇచ్చే వాణిజ్య ప్లాట్ల్లు, మెట్రో రైలు, 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడే బస్టాండు గల ప్రాంతాల్లో ఉంటాయని, దాంతో వారికి ఎక్కువ లబ్థి చేకూరుతుందని సీఆర్‌డీఏ కమీషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ రైతులకు చెప్పారు . 90శాతం మంది రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మీదటే ప్లాట్లు కేటాయింపు కార్యక్రమం చేపట్టామని కమిషనర్‌ తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ రైతులనుద్దేశించి మాట్లాడుతూ, రాజధాని రాక ముందు రాయపూడికి ప్రత్యేకత ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు రాయపూడి దగ్గర్లోనే నిర్మాణం చేయటంతోరాయపూడి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు ,

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లో ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతి మరింత ద్విగుణీకృతం అవుతుందని ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. మెట్ట రైతులకు 919 రెసిడెన్సియల్‌ ప్లాట్లు, జరీబు రైతులకు 1003 ప్లాట్లు కేటాయిచారు. 1,458 వాణిజ్య ప్లాట్లను కంఫ్యూటర్‌లో బటన్‌నొక్కి కేటాయించారు. అనంతరం ప్రొవిజన్‌ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

టిఏటిఏ న్యూ యార్క్ లో ఉన్ని దుస్తుల పంపిణి
సముద్రంమధ్య లో ఆలా చేస్తారా .!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*