పల్లె రఘునాథ్ రెడ్డి @ ‘యువ ప్రవాసీ భారత్’ సదస్సు

Share this News:

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు. బెంగళూరులో జరుగుతున్న ‘యువ ప్రవాసీ భారత్ ’ సదస్సులో భాగంగా  రెండో రోజు ఆదివారం నిర్వహించిన  కార్యక్రమంలో  మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని  యువతలోని  సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించి మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేషంగా కృషిచేస్తున్నరన్నారు.  ఇప్పటికే ఆదిశలో చర్యలు చేపట్టడం జరిగిందని, టెక్నాలజీ పరంగా యువ పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిలో నైపుణ్యాభివృద్ధికి విశేషమైన తోడ్పాటును అందిస్తున్నామన్నారు.  ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. దీంతొ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం జరిగిందన్నారు.  పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందకు రావాలని కోరారు.

ఐటీ రంగంలో కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సాంకేతిక పరమైన అంశాలను  ఏపీలో అనుసరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియంకా కార్గిల్ కు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఐటీ రంగంలో సాంకేతిక పరమైన అంశాలను రాష్ట్రంలో అమలుసాధ్యాలపై మంత్రి చర్చించారు.

బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక కార్గిల్, డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దేశ్ పాండే, నీటిపారుదల, న్యాయ శాఖ మంత్రి జై చంద్రతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి  సమావేశమయ్యారు.

ప్రధానమంత్రిని కలిసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి

బెంగళూరులో యువ ప్రవాసీ భారత్ సమావేశానికి హజరైన ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధిపరిచేందుకు సహకారం అందించాలని ప్రధానిని కోరారు. సింగపూర్, కెనడా, అమెరికా, దుబాయ్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రవాస భారతీయులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వనించడం జరిగిందని ప్రధానికి వివరించారు. కేంద్ర  విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ కలిసి మన దేశం నుంచి దుబాయ్, అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి చర్చించారు.

నేనే ముఖ్యమంత్రిని ఐతే ..!
అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యానికి ఆసక్తి కనబర్చిన శ్రీలంక

Share this News:

Leave a comment

Your email address will not be published.

*