వరుణ్‌ని వదలని వర్మ..!

Share this News:

ram gopal varma tweets on varun tej
ఖైదీ నంబరు 150 సినిమా వేదికపై నాగబాబు వ్యాఖ్యలతో మొదలైన వివాదం రగులుతూనే ఉంది.. పేరు పెట్టకుండానే తీవ్రంగా విమర్శించిన నాగబాబుపై రాంగోపాల్‌ వర్మ మాటకు మాట చెప్పడంతోపాటు కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.. తనని కించపరిచారన్న కారణంతో మెగాఫ్యామిలీ హీరో ఎంతో గొప్పవారని.. వారికి ప్రతిష్ఠను బేలెన్స్‌ చేయడానికే నాగబాబుని ఆయన కుటుంబంలో పుట్టించాడని వ్యంగ్యాస్త్రాలు విసిరిన వర్మ తాజాగా వరుణ్‌ని వదలడం లేదు. వరుణ్‌ పెట్టిన ఒక ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ‘నువ్వు మీ నాన్నను ఫాలోకాకు..ముఖ్యంగా సలహాల విషయంలో మీ పెదనాన్నని చూసి నేర్చుకో.. నీ తండ్రిని నమ్మితే మోసపోతా’వంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.. అన్న తండ్రితో మాట్లడం మాని కొడుకుని ఈ వివాదంలో లాగడమేంటని.. అదీ కొడుకుతో తండ్రిని తక్కువ చేసి మాట్లాడం పద్ధతిగా లేదంటూ ఇండస్ట్రీ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే మెగాఫ్యామిలీ ఫ్యాన్స్‌ వర్మకు ఘాటుగానే సమాధానం ఇస్తున్నా.. వర్మ వాటిని పట్టించుకోకుండా వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారని.. అసలు వర్మకు ఏమైంది… మతి బ్రమించిందా అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ని ఇకనైనా వదిలేసి వర్మ మాములుగా ఉంటారో లేదో చూడాలి.

 

ఖైదీ నెంబర్ 150 లేటెస్ట్ ట్రయిలర్ ఇదిగో ఒక లుక్ వెయ్యండి
“గౌతమీపుత్ర” క్రిష్ ట్వీట్ చేసాడట ?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*