నేనే ముఖ్యమంత్రిని ఐతే ..!

Share this News:

దివంగత మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలామ్ “కలలు కనండి” అన్న మాటను ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అక్షరాలా నిజం చేస్తున్నట్టే వున్నారు. నిన్న కర్నూలు జిల్లాలో అయన పర్యటించారట అక్కడ రైతులతో కూడా మాట్లాడారట..చంద్ర బాబు నాయుడు ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇచ్చారని ఇప్పుడు రైతులకు నరకం చూపిస్తున్నారని అన్నారట అంతే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనం అని అయన అనేసారు. అంతే కాదు ఒకడుగు ముందుకేసి బోలెడు అన్నారు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి గా పనిచేసిన కాలం లో ప్రాజెక్టుల గురించి వివరించారు .

 

అయితే ఒక్క విషయం గమనించాల్సిన అవసరం వుంది .తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించింది తెలుగు వాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారనే, రైతు ప్రభుత్వం రావాలనే ,ఆ రోజు ఆలా తాకట్టు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తెలుగు దేశం పార్టీ అజెండా “రైతు” సంక్షేమం. అలాంటప్పుడు రైతు ను విస్మరించే ప్రసక్తే ఉండదు అనేది గమనిస్తే బావుంటుంది ,అంతెందుకు వైయస్సార్ హయం లో మాత్రం ఒక్క రోజులో అయ్యిపోయాయా ప్రాజెక్టులు అన్నీ, పోలవరం మరి ఆరోజెందుకు ముందుకు పోలేదు , పట్టిసీమ పరిస్థితి ఏమిటి ,మరి ఈ రోజు ఆ ప్రాజెక్ట్స్ ఎంత ముందుకు వెళ్ళాయో ప్రత్యేకం గా చెప్పే అవసరం లేదు .

 

రాష్ట్ర విభజన తరువాత పడిన.. పడుతున్న కష్టాలు తెలియనివి కాదు నలుగురు మనుషులు ఉన్న ఇంట్లో లోటు బడ్జెట్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పే అవసరం లేదనుకుంటా, అలాంటిది ఒక రాష్ట్రాన్ని గట్టెక్కించాలి అంటే ఎంత బాధ్యతతో వ్యవహరించాలి అనే విషయం నాయకుడు అనే వాడు గమనించాల్సిన అవసరం వుంది నిజానిజాలను బేరీజు వేసుకొని ఆరోపణలు చేస్తే మంచిదేమో.. కేవలం రాజకీయ స్వార్థంకోసం అవాకులు చవాకులు మాట్లాడి గురివింద చందం గా వ్యవహరించటం మానుకోవటం మంచిదేమో ! వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి పుట్టగతులు లేకుండా చేయాలనీ ఉవ్విళ్ళుఊరుతున్న జగన్ బాబు కు ఈడీ కష్టాలు , అక్రమాస్తుల కష్టాలు తీరతాయో లేదో ..వాటి దెబ్బకు అయన ఏమైపోతాడో పాపం ..! కళ్ళు మూసుకొని వుంటా అన్నారు ఆ మధ్య ఒక ఉత్తరాంధ్ర పర్యటనలో ఇప్పుడు కర్నూల్ జిల్లా లో ఇలా నేనే ముఖ్యమంతిని ఐతే అంటూ ..కలలు కంటూ …ఓదారుస్తున్నారు ..

నమో వెంకటేశాయ ఆడియో ఆవిష్కరణ
పల్లె రఘునాథ్ రెడ్డి @ ‘యువ ప్రవాసీ భారత్’ సదస్సు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*