నమో వెంకటేశాయ ఆడియో ఆవిష్కరణ

Share this News:

సాయికృపా ఎంటర్‌టైనమెంట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఎ. మహేశరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ కార్యక్రమం జరిగింది . అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌, సౌరభ్‌రాజ్‌ జైన ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు కూర్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఆడియో సీడీలను నాగచైతన్య, అఖిల్‌ సంయుక్తంగా ఆవిష్కరించగా, థియేట్రికల్‌ ట్రైలర్‌ను ‘బాహుబలి’ నిర్మాతలు శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘కీరవాణి సంగీతం వింటే కన్నీళ్లు వస్తూనే ఉంటాయి.అన్నారు

రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘స్వామి నా కోరికలు చాలా తీర్చాడు. గొప్ప తల్లిదండ్రులనీ, గొప్ప కుటుంబాన్నీ ఇచ్చాడు. గొప్ప గొప్ప సినిమాలు, అన్ని రకాల సినిమాలు తీసే అవకాశమిచ్చాడు. అందరు హీరోలతో పనిచేసే అవకాశమిచ్చాడు. ఇవన్నీ స్వామి ఇచ్చాడు తప్ప నేను చేసింది కాదు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘పాండురంగడు’ చేస్తానని అనుకోలేదు. ఆయన దయవల్లే వచ్చాయి. అయితే ఆయన గురించి ఏమీ తియ్యలేకపోయాననే బాధ ఉండేది. అప్పుడు ‘ఓం నమో వేంకటేశాయ’ అనే సినిమా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నా. ఒక మహాభక్తుడు, స్వామి మధ్య జరిగే కథను భారవి రాసుకొచ్చారు. హాథీరామ్‌బాబా పాత్రకు నాగార్జునే కనిపించారు. దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్లతో చూడాలన్నంతగా ఈ సినిమాలో ఆయన హావభావాలు ప్రదర్శించారు. మహాభక్తురాలు గోదాదేవిగా అనుష్క అద్భుతంగా నటించింది. హిందీలో శ్రీకృష్ణునిగా చేసిన సౌరభ్‌జైనలో వేంకటేశ్వరస్వామి కనిపించారు.

హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో చేస్తానని కూడా అనుకోలేదు.. అదీ నాగార్జునగారితో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారామె. జగపతిబాబు మాట్లాడుతూ ‘‘నాకో బంపర్‌ ఆఫర్‌ ఏమిటంటే.. చాలా కాలం తర్వాత నాకో పాట ఇచ్చారు.. అది కూడా అనుష్కతో. చిన్న పాత్రయినా నా స్నేహితుడైన నాగార్జునతో కలిసి చేయడాన్ని ఆస్వాదించా’’ అని తెలిపారు. కీరవాణి మాట్లాడుతూ ‘‘అన్నమయ్య, రామదాసు.. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ.. ఈ ప్రయాణం చూస్తుంటే రాఘవేంద్రరావుగారితో, నాగార్జునగారితో.. ‘తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో’ అని అనాలనిపిస్తోంది’’ అన్నారు. ‘అన్నమయ్య’. కంటే ఈ సినిమా మరింత అద్భుతంగా ఉంటుందని నిర్మాత మహేశరెడ్డి చెప్పారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, అమల, నాగచైతన్య, అఖిల్‌, నాగసుశీల, ప్రగ్యా జైస్వాల్‌, సౌరభ్‌రాజ్‌ జైన, విమలా రామన, ఎస్‌. గోపాల్‌రెడ్డి, జె.కె. భారవి, వేదవ్యాస్‌, అనంత శ్రీరామ్‌, రామజోగయ్యశాసి్త్ర, రఘుబాబు, పృథ్వీ, అస్మిత తదితరులు పాల్గొన్నారు.

 

డిఫరెంట్ గా వస్తున్న దువ్వాడ జగన్నాధం
నేనే ముఖ్యమంత్రిని ఐతే ..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*