వెంకట్రామయ్యకు రామోజీ మద్దతు

Share this News:

సంక్రాంతికి సినిమాల కోలాహలం చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడు లేనంతగా ఈ సారి చిరు.. బాలయ్య చిత్రాలు బరిలో నిలవడంతో అసలు పందెంకోళ్ల పోటీ మొదలైందనే చెప్పాలి.. మరి ఖైదీ నంబర్‌ 150, గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలకు కావాల్సినన్ని థియేటర్లు వారి ఇమేజ్‌ని బట్టి ఇట్టే దొరికేశాయి.. ఇక దిల్‌ రాజు నిర్మాణ సారధ్యంలో 14న వస్తున్న శతమానంభవతి చిత్రానికి కూడా సొంత హాళ్లతోపాటు లీజుకు తీసుకున్నవి చేతిలో ఉండటంతో సమస్య లేనట్టే.. ఎటుతిరిగి ఆర్‌.నారాయణమూర్తి, జయసుధ జంటగా నటించిన హెడ్ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య చిత్రానికొచ్చేసరికి అసలు సినిమా కష్టాలు మొదలయ్యాయి. చదలవాడ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రం సంక్రాంతి రోజున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు.. కాని ఎక్కడ కావాల్సినన్ని థియేటర్లు దొరకటం లేదు సరికదా.. అసలు విడుదల జరగుతుందా లేదా అనే సందేహం కూడ కలిగేలా పరస్థితులు మారిపోయాయి.. దీంతో నారాయణమూర్తే నేరుగా ఊరుకొక థియేటర్‌ ఇవ్వండి  బాబు అని వేడుకున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ అంశం మీడియా మొగల్‌ రామోజి రావుని కదిలించిందట… దీంతో అస్వస్తతతో ఆసుపత్రిలో ఉన్నా సరే ఆ సినిమాకి థియేటర్లు ఇప్పించాలని తన మనుషులకు ఆదేశించారు. మయూరి డిస్ట్రిబ్యూషన్‌, ఫిల్మిసిటీ సంబంధాల సాయంతో 100 థియేటర్ల వరకు ఆ సినిమాకు వచ్చేలా చేయగలిగారట.. మెయిన్‌ థియేటర్‌గా ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా 35 ఎంఎం కూడా జెండా  ఊపినట్లు తెలుస్తుంది. మొత్తానికి రామోజి చలువతో వెంకట్రావు బయటపడ్డాడనే చెప్పాలి…

మామ 150 వ సినిమాలో అల్లుడు కనిపిస్తాడట
డిఫరెంట్ గా వస్తున్న దువ్వాడ జగన్నాధం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*