డిజిమేళాలో ఆకట్టుకున్న ఆధార్ కౌంటర్

Share this News:
  • నిమిషాలలోనే ఆధార్ లో మార్పులకు UIDIA చొరవ
  • నమోదు పక్రియలో పాల్గొంటున్న వృద్దులు

గంటల తరబడి కౌంటర్ల ముందు వేచి ఉండి  నిర్వేదనకి గురయ్యే ఆధార్ కార్డు లబ్దిదారులకు ఒక సౌలభ్యా న్ని కలగజేసింది UIDIA.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాటు చేసిన డిజిధన్ మేళ లో ఆధార్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ఆకర్షణగా  నిలిచింది. రెండు రోజుల పాటు ఆధార్ సంబంధిత సేవలను లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో కొత్త ఆధార్ కార్డు కావాలన్న, ఉన్న కార్డులో సవరణలు, మార్పులు చేసుకోవాలన్న సునాయాసమే అంటున్నారు ఆధార్ అధికారులు. కొద్ధి  సేపట్లనో ప్రజలకు అవసరమైన సేవలను అందించడానికి  కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కొత్త ఆధార్ కార్డు ఉచితంగా పొందవచ్చు. కార్డులో మార్పులు చేసుకోడానికి 25 రూపాయలు చెల్లించాలి. కొత్త కార్డుకు కావలసిన పత్రాలు అన్ని సక్రమంగా ఉంటె నమోదు చేసే కార్యక్రమం యిట్టె అయిపోతుంది. అయితే వీటికి కావలసిన డాక్యూమెంట్ల నకలును మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలి. ఆధార్ లో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు మార్చుకోడానికి తప్పనిసరిగా ఆధార్ కాపీ ని, తగిన ఆధారం గల పత్రాన్ని పొందుపరిస్తే త్వరిత గతిన పని పూర్తవుతుంది. ఆన్లైన్లో కూడా ఆధార్ కి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే మార్గదర్శనాన్నీ ఇక్కడ అధికారులు వివరిస్తున్నారు. వృద్దులు, వికలాంగుల కు ప్రత్యేక సేవలను ఈ కౌంటర్లో అందిస్తున్నారు.    

నగదు రహిత లావాదేవీలే లక్ష్యముగా ఏర్పాటైన డిజిధన్ మేళాలో ప్రజలకు మరింతగా అవగాహన పెంచేందుకు మొత్తం  80 స్టాళ్లు ఏర్పాటు చేసారు. వీటిలో  26 బ్యాంకులు, 10 ప్రభుత్వ ఏజెన్సీలు, 11 ఫెర్టిలైజర్స్ కంపెనీలు, 5 వ్యవసాయ సోసిటీలు, NPCI, ఐటీ  మంత్రిత్వశాఖ, చమురు, ఇంధన కంపెనీలు తమ షాపులు ఏర్పాటు చేసి వారు అందించే సేవలను డిజిటల్ ప్రక్రియలో చేపట్టే విధానాలను వివరిస్తున్నారు. విద్యార్థులు, మహిళలు,  వ్యాపార వర్గాల నుంచి డిజిధన్ మేళాకు భారీగా తరలివస్తున్నారు.

కొత్త లుక్ లో చిరు అదర కొట్టాడు…
నగదు రహితం సాధ్యమేనా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*