‘ఎయిర్‌ ఇండియా’ ప్రపంచ చెత్త సర్వీస్

Share this News:

+ సమయపాలన లేని సంస్థగా గుర్తింపు
+ పరువు నిలిపిన జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగో
air-india-on-worlds-worst-airlines-list2ఎంత గొప్ప చరిత్ర ఉన్నా సరే అది ప్రభుత్వ సంస్థ అయితే చాలు టన్నులకొద్దీ అలసత్వం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా విషయంలోనూ అదే నిరూపితమైంది. సమయపాలన పాటించకపోవడంలో రికార్డుకెక్కి సర్కారు పరవు తీసింది. ఒక వైపు కేంద్రం ఎంతగా ఆదుకుంటున్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా తీరు మారడం లేదు. ఏ మాత్రం సమయ పాలన పాటించని ప్రపంచలోని టాప్‌ త్రీ విమానయాన సంస్థల్లో ఎయిర్‌ ఇండియా ఒకటిగా రికార్డులకెక్కింది. విమానయాన సంస్థల రాకపోకలు, సేవలకు సంబంధించి ఏటా సర్వే చేసి ర్యాంకులిచ్చే అంతర్జాతీయ సంస్థ ‘ఫ్లయిట్‌స్టాట్స్‌’ అనే సంస్థ ఈ విషయం పేర్కొంది. ఈ సంస్థ 8వ యాన్యువల్‌ ఎయిర్‌లైన్‌ ఒటిపి సర్వీస్‌ అవార్డ్స్‌’ పేరుతో ఇందుకు సంబంధించిన సర్వే నివేదికను విడుదల చేసింది. ఇందుకోసం ఆసియా-పసిఫిక్‌ దేశాలకు చెందిన పలు విమానయాన సంస్థల రాకపోకలు, సేవలను ఈ సంస్థ పరిశీలించింది. అప్పుడు కూడా మేల్కొనని ఎయిర్‌ ఇండియా అధికారులు ఈ సర్వే పెద్ద కల్పితమనిసరిపెట్టుకున్నారు. ఈ సర్వేని పూర్తి స్థాయిలో పరిశీలిస్తుందని కంటితుడుపు స్పందన తెలిపారు. అయితే దీనికి భిన్నంగా ప్రైవేటు విమానరంగ సంస్థలు మన దేశ పరవు నిలిపాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో మాత్రం సమయపాలన పాటించండంలో టాప్‌ 10లో స్థానం సంపాదించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల్లో 76.1 శాతం, ఇండిగో సర్వీసుల్లో 74.2 శాతం విమానాలు సమయానికి నడుస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ 87.33 శాతం సర్వీసులను సమయానికి నడుపుతూ మొదటిస్థానం సంపాదించింది. సమయ పాలనలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వ నిర్వహణలోని ఇఐ ఎఐ, ఐస్‌లాండ్‌ ప్రభుత్వ నిర్వహణలోని ఐస్‌ల్యాండ్‌ ఎయిర్‌ విమానయాన సంస్థలు మన ఎయిర్‌ ఇండియా కంటే అధ్వాన్నంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఇప్పటికైనా ప్రైవేటు విమానయాన సంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వరంగ సంస్థ తీరు మార్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

శారీరక శ్రమ చేయ్‌.. సంతోషం రెట్టింపు చేయ్‌..!
గౌతమీ పుత్రకు ..పన్ను లేదు ..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*